Latest Updates
-
మీ జీర్ణవ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందనడానికి 10 సంకేతాలివే -
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం
బంగాళదుంపతో ఇలా దోశ వేస్తే రుచికి ఫిదా అవ్వాల్సిందే.. తయారీ విధానం ఇదే..
బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ అవే ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పూరీలు ఎంత కాలం తింటారు చెప్పండి..మీ నాలుక ఏదైనా కొత్త రుచి కోసం కొట్టకలాడుతుంటే ఒక్కసారి ఆలూ దోశ ట్రై చేయండి. నిమిషాల్లో తయారుచేసుకునే ఈ వంటకం, అటు రుచిలోనూ ఇటు ఆరోగ్యపరంగానూ ఎంతో ప్రత్యేకం.
బయట కరకరలాడుతూ, లోపల ఎంతో మృదువుగా ఉండే ఈ ఆలూ దోశ చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గానే కాకుండా, సాయంత్రం వేళ గుమగుమలాడే టీతో పాటు తింటే ఆ రుచే వేరు. ఆలూ దోశ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-ఒక బంగాళాదుంప (తురిమినది)
-2 టేబుల్ స్పూన్ల శనగపిండి
-1 టీస్పూన్ బొంబాయి రవ్వ
-1 టీస్పూన్ కార్న్‌ఫ్లోర్ (మక్క పిండి)
-1 టీస్పూన్ ఉల్లిపాయ ముక్కలు
-1 పచ్చి మిరపకాయ
-పావు టీస్పూన్ పసుపు
-పావు టీస్పూన్ ధనియాల పొడి
-పావు టీస్పూన్ జీలకర్ర పొడి
-సరిపడా కారం పొడి
-తగినంత ఉప్పు
-కాల్చడానికి సరిపడా నూనె
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఆలూ దోశ తయారుచేసే విధానం
-మొదటగా బంగాళదుంప తొక్కను శుభ్రంగా తొలగించి, నీటితో కడగాలి. ఇప్పుడు దానిని సన్నగా తురుముకుని, కొన్ని నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి, బంగాళదుంప తురుములో అదనపు తేమ ఏమాత్రం లేకుండా చేతులతో గట్టిగా పిండాలి.
-ఇప్పుడు ఒక విశాలమైన గిన్నె తీసుకుని, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న తురిమిన బంగాళదుంపను వేయాలి. దీనికి శనగపిండి, బొంబాయి రవ్వ, కార్న్‌ఫ్లోర్ జోడించాలి. ఈ మిశ్రమానికి మరింత రుచిని తెచ్చేందుకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. అలాగే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, తగినంత ఉప్పు వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా చేతితో కలపాలి.
-ఇప్పుడు పొయ్యి మీద నాన్ స్టిక్ పెనం (తవా) పెట్టి వేడి చేయాలి. పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె రాయాలి. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పెనం మధ్యలో వేసి గుండ్రంగా పలుచగా పరచాలి. చిల్లా మీద కొద్దిగా నూనె చల్లుకుని, మూత పెట్టి సుమారు రెండు నిమిషాల పాటు తక్కువ మంట మీద మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న బంగాళదుంప చక్కగా ఉడుకుతుంది.
-ఒక వైపు చక్కగా కాలిన తర్వాత, మూత తీసి నెమ్మదిగా రెండో వైపునకు తిప్పాలి. మంటను మధ్యస్థంగా ఉంచుతూ, రెండు వైపులా చక్కటి బంగారు రంగు వచ్చే వరకు, కరకరలాడే వరకు కాల్చుకోవాలి. మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా చిల్లాలుగా వేసుకోవాలి.
-అంతే గుమగుమలాడే వేడివేడి, కరకరలాడే ఆలూ దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
