Latest Updates
-
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం..బెల్లం కుడుములు సింపుల్ గా ఎలా చేసుకోవాలంటే
వినాయక చవితి పండుగ వస్తుందంటే చాలు, ప్రతి ఇంట్లో గుమగుమలాడే బెల్లం కుడుములు, ఉండ్రాళ్లు, పాయసం వంటివి వండుతారు. వీటిలో బెల్లం కుడుములు చాలా ప్రత్యేకమైనవి. వీటిని గణపతికి ఎంతో ఇష్టమైన ప్రసాదంగా భావిస్తారు. బెల్లం కుడుములు రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బుధవారం(ఆగస్టు 27,2025)వినాయకచవితి సందర్భంగా గణనాథుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
బెల్లం కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెల్లం
-నీళ్లు
-యాలకల పొడి
-ఉప్పు
-కొబ్బరి తురుము
-బియ్యం పిండి
-నెయ్యి

బెల్లం కుడుములు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ముప్పావు కప్పు బెల్లం తురుము, 1కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి.
-బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం నీళ్లను వడకట్టి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన నెయ్యిలో అరకప్పుకి కొంచెం తక్కువగా కొబ్బరి తురుము వేసి నిదానంగా వేయించాలి.
-కొబ్బరి తురుము లైట్ గా బంగారు రంగులోకి మారిన తర్వాత అందులో వడకట్టి తీసుకున్న బెల్లం నీళ్లను పోసేయాలి. ఇందులోనే పావు టీస్పూన్ యాలకల పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి బెల్లం నీళ్లను ఒక పొంగు వచ్చేదాకా మరిగించాలి.
-తర్వాత మంటను తక్కువలో ఉంచి బెల్లం నీళ్లలో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. గట్టి పిండిముద్ద అయ్యేదాకా కలుపుతూ ఉడికిచుకోవాలి.
-పిండి ఉడికి దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆపేసి కడాయిని పక్కన పెట్టి దానిమీద మూతపెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత చేతిలోకి కొంచెం నెయ్యి తీసుకొని పిండి మెత్తాన్ని చేత్తో బాగా నలుపుతూ మెద్దగా చేయాలి.
-ఇప్పుడు అందులో నుంచి పిండిని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని రౌండ్ బాల్స్ లా చుట్టుకోండి.
-తర్వాత వాటిని మీకు నచ్చిన షేపులో కుడుముల్లా వత్తుకోండి. అంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
