మిక్సీ,రోలు కూడా అక్కర్లేదు..చేత్తోనే సూపర్ టేస్టీ కాలీఫ్లవర్ పచ్చడి చేసుకోండిలా..తింటుంటే స్వర్గమే!

Posted By:

తెలుగు వారి భోజనంలో పచ్చడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పచ్చడి లేనిదే మనకు ముద్ద దిగదు. సాధారణంగా మనం ఆవకాయ, మాగాయ, టమాటా పచ్చళ్లను ఎక్కువగా తింటూ ఉంటాం. కానీ శీతాకాలంలో విరివిగా లభించే కాలిఫ్లవర్ తో కూడా అద్భుతమైన రుచికరమైన పచ్చడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.

పుల్లపుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. కాలిఫ్లవర్ పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Make Mouth Watering Cauliflower Chutney in Minutes Simple Recipe in Telugu

తయారీకి కావలసిన పదార్థాలు

-కాలిఫ్లవర్
-ఎండుమిర్చి
-టమాటో
-ఉప్పు
-నూనె
-నిమ్మరసం
-వెల్లుల్లి రెబ్బలు
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-పసుపు

తయారీ విధానం

-ముందుగా కాలిఫ్లవర్‌ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఉండాలి.

-కట్ చేసిన ముక్కలను శుభ్రంగా కడుగుకోవాలి.

-స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కాలీఫ్లవర్ ముక్కలు, 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి ముక్కులు మునిగేవరకు నీళ్లు పోసి మూతపెట్టి పెద్ద మంట మీద 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆపేసి ముక్కలను తీసి పక్కన పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో 3 స్పూన్ల ఆవాల నూనె వేసి వేడయ్యాక 15 ఎండు మిరపకాయల ముక్కలు వేసి మంచి రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.

-స్టవ్ మీద పాన్ లో ఉన్న ఆయిల్ లోను గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మీడియం మంట మీద కలుపుతూ మెత్తగా అయ్యవేకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ మీద ఉన్న పాన్ లోనే మరొక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 2 ఉల్లిపాయల సన్నని చీలికలు వేసి ఎర్రగా అయ్యేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే అందులో 3 టమాటోల పెద్ద ముక్కలు వేసి మూతపెట్టి ఉంచాలి.

-టమాటోల తొక్క పైభాగం ఊడేటప్పుడు ఆ తొక్కను తీసిసి టమాటోను రెండోవైపుకి తిప్పి (తిరగేసి)మూతపెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. టమాటోలు పచ్చిదనం లేకుండా ఉడికాక స్టవ్ ఆపేయాలి.

-ఇప్పుడు వేయించిన ఎండుమిర్చిలో రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో లేదా పప్పు గుత్తితో వీటిని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించిన వెల్లుల్లి,ఉల్లిపాయ,టమాటో ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి వాటిని కూడా మెత్తగా మెదుపుకోవాలి.

-చివరగా అందులో కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు చల్లుకొని, కొద్దిగా నిమ్మరసం కలుపుకోండి. అంతే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, January 22, 2026, 12:41 [IST]
Desktop Bottom Promotion