Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ప్రసాదం దద్దోజనం..ఆరోగ్యానికి ఆరోగ్యం,రుచికి రుచి..ఇంట్లోనే ఇలా చేసుకోండి
సాధారణంగా పండుగలప్పుడు నైవేధ్యంగా,ఇంట్లో శుభకార్యాలకు లేదా దేవాలయాల్లో ప్రసాదంగా ఎక్కువగా దద్యోధనం పెడతారు. దీనిని దద్దోజనం అని కూడా పిలుస్తారు. వండిన అన్నం, పెరుగు, పోపు దినుసులతో దీనిని తయారుచేస్తారు. దీనిని తరచుగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రసాదంగా అందిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి ఘాటైన మసాలాలు అవసరం లేదు, దీనిలోని సాత్విక గుణం,తేలికపాటి రుచి దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. దీనిని తయారుచేయడం చాలా సులభం..పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ప్రసాదం దద్దోజనం మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ప్రసాదం దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-నీళ్లు
-సొంఠి పొడి
-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-మిరియాలు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-పచ్చిమిరపకాయ
-ఎండు మిరపకాయ
-అల్లం తరుగు
-పాలు
-పెరుగు
-ఉప్పు
-కొత్తిమీర
-కరివేపాకు

ప్రసాదం దద్దోజనం ఇంట్లోనే తయారీ విధానం
ముందుగా ముప్పావు కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టండి.
నానిన బియ్యాన్ని కుక్కర్ లో వేసి 750 ml నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటమీద 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికించాలని గుర్తుపెట్టుకోండి.
తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేసి అందులో అర ఇంచు సొంఠి వేసి ఎర్రబడేదాకా మీడియం మంటమీద వేయించి తీసేసి దానిని మెత్తని పొడిగా అయ్యేలా దంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనిచ్చాక 1 టీస్పూన్ జీలకర్ర, ముప్పావు టీస్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి వేపుకోండి. దాదాపుగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు, కారం తక్కువగా ఉండే 1 పచ్చిమిరపకాయ సన్నని ముక్కలు, అర టీస్పూన్ అల్లం తరుగు వేసి వేపుకోండి.
ఇప్పుడు మెత్తగా వండిన అన్నంలో ఉప్పు వేసి కలిపి తర్వాత అర లీటరు పెరుగు, పావు లీటరు కాచి చల్లార్చిన పాలు, తాళింపు, 1 టీస్పూన్ సొంఠి పొడి వేసి బాగా కలిపి మళ్లీ పావు లీటరు కాచి చల్లార్చిన పాలు పోసి కలిపాక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి కలుకోండి. కొద్దిగ సమయం తర్వాత దీన్ని తీసుకొని తింటే ఆహా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications