Latest Updates
-
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి
మ్యాంగో గులాబ్ జామ్ తిన్నారా? సమ్మర్ అయిపోయే లోపు తప్పకుండా తిన్సాల్సిన స్వీట్!
వేసవిలో మామిడి పండ్లతో రకరకాల వంటకాలు చేసుకోవడం మనకు అలవాటే. ఇప్పటికే మీరు మామిడి పన్నా, చల్లని మామిడి జ్యూస్, తియ్యటి మామిడి ఖీర్, మామిడితో చేసిన అనేక ఇతర వంటకాలను రుచి చూసే ఉంటారు. కానీ బాగా పండిన మామిడి పండుతో ఎప్పుడైనా గులాబ్ జామ్ లేదా మామిడి రసగుల్లా తయారు చేసి చూశారా? ఒక్కసారి ఈ మామిడి స్వీట్ ని రుచి చూశారంటే మీరు కచ్చితంగా దీనికి పెద్ద ఫ్యాన్ అయిపోతారు.

మ్యాంగో గులాబ్ జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మామిడిపండు
-బొంబాయి రవ్వ
-నెయ్యి
-నూనె
-చక్కెర
-ఆరెంజ్ ఫుడ్ కలర్
-యాలకలు
-పాలపొడి
మ్యాంగో గులాబ్ జామ్ తయారీ విధానం
-ముందుగా ఈ స్వీట్ చేయడానికి బాగా పండిన, తీయగా ఉండే ఒక పెద్ద మామిడి పండును తీసుకోండి. మామిడి పండులో పీచు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. పండు తొక్క తీసి, ముక్కలుగా కోసి సుమారు ఒక కప్పు వరకు గుజ్జును సిద్ధం చేసుకోండి. ఒక పెద్ద మామిడి పండు లేదా రెండు చిన్న పండ్లు సరిపోతాయి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న మామిడి గుజ్జులో పాలు లేదా చక్కెర లాంటివి ఏమీ కలపకుండా, కేవలం మామిడి ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని, అందులో అర కప్పు సన్నటి బొంబాయి రవ్వ (సూజీ) వేయాలి. ఒకవేళ మీ దగ్గర ఉన్న రవ్వ కాస్త లావుగా ఉంటే, దాన్ని మిక్సీలో వేసి ఒకసారి బ్లెండ్ చేసి మెత్తగా చేసుకోండి. ఆ రవ్వలో 1 టీస్పూన్ నెయ్యి వేసి, మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి సుమారు 5 నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. రవ్వ తేలికగా వేగిన తర్వాత, మనం ముందుగా సిద్ధం చేసుకున్న మామిడి గుజ్జును అందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
మామిడి గుజ్జు, బొంబాయి రవ్వ బాగా కలిసిపోయి, పాన్ అంచులను వదిలి ఒక పిండి ముద్దలా అయ్యేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా నెయ్యి రాసిన పళ్ళెంలోకి తీసుకోవాలి.

-పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో 1 కప్పు చక్కెర, 1 కప్పు నీళ్లు పోసి పంచదార కరిగే వరకు మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత మరో 5 నిమిషాలు ఉడికించండి. పాకానికి తీగ రావలసిన అవసరం లేదు, రెండు వేళ్ల మధ్య పట్టుకుంటే కాస్త జిగురుగా తగిలితే చాలు. మంచి రంగు కోసం ఇందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్, రుచి కోసం రెండు దంచిన యాలకులు వేసి స్టవ్ ఆపేయండి.
-పళ్ళెంలోకి తీసుకున్న మామిడి, రవ్వ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో 2 టేబుల్ స్పూన్ల పాలపొడిని కలపండి. ఈ పాలపొడి వల్లే స్వీట్ కు మావా లాంటి కమ్మటి రుచి వస్తుంది. పిండి చేతులకు అంటుకోకుండా ఉండటానికి అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని మృదువుగా కలపండి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా పగుళ్లు లేకుండా చుట్టుకోండి. ఉండలన్నీ ఒకే పరిమాణంలో రావడానికి ఒక స్పూన్ కొలతతో పిండిని తీసుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యి లేదా నూనె వేడి చేయండి. మంటను తక్కువలో ఉంచి, సిద్ధం చేసుకున్న గులాబ్ జామున్లను నెమ్మదిగా నూనెలో వేయండి. అవి లోపల వరకు ఉడికి, పైన బంగారు గోధుమ రంగులోకి మారేంత వరకు దోరగా వేయించాలి.
-వేగిన వాటిని వెంటనే బయటకు తీసి, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి మూత పెట్టేయండి. వీటిని కనీసం ఒక గంట పాటు పాకంలో నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల జామున్లు పాకాన్ని బాగా పీల్చుకుని, పరిమాణంలో కాస్త పెద్దవిగా, లోపల అత్యంత రసభరితంగా తయారవుతాయి.
-అంతే నోరూరించే మ్యాంగో గులాబ్ జామున్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
