Latest Updates
-
జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే -
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి! -
విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఉసిరి సూప్..చలికాలంలో దీన్ని మించింది లేదు! -
పురుషుల దినోత్సవం స్పెషల్ స్వీట్..నోట్లో వెన్నలా కరిగిపోయే క్రీమీ రబ్రీని ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
చాక్లెట్ బ్రౌనీ చీజ్ కేక్ రెసిపీ.. పురుషుల దినోత్సవాన మీ ప్రియమైన వారికి ఇలా స్వీట్ సర్ ప్రైజ్ ఇవ్వండి! -
International men's day: ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే! -
పిల్లల ఆట అనుకుంటున్నారా? పెద్దలు ఉయ్యాల ఊగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే! -
చలికాలం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా.. -
చలికాలంలో హార్ట్ ఎటాక్ ముప్పు? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! -
కేరళ స్పెషల్ మలబార్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్లు కూడా చిటికెలో చేసేయొచ్చు!
ఉద్యోగస్తులు, బ్యాచిలర్స్ కోసం త్వరగా అయిపోయే మసాలా కొబ్బరి అన్నం...పిల్లల లంచ్ బాక్స్ కు బెస్ట్
ప్రతిరోజూ ఒకే రకమైన వంటకాలు తిని పిల్లలు కూడా విసుగు చెందుతుంటారు. సాధారణంగా చాలామంది ఇంట్లో వెరైటీ రైస్ అంటే నిమ్మకాయ పులిహోర, జీరా రైస్ లేదా మామూలు కొబ్బరి అన్నం చేస్తుంటారు. మీ పిల్లలకు కొబ్బరి అన్నం అంటే నిజంగా ఇష్టమా? అయితే ఎప్పుడూ ఒకే రుచితో కాకుండా, ఈసారి కాస్త భిన్నంగా, ఘుమఘుమలాడే మసాలా కొబ్బరి అన్నం వండి చూడండి.
సాధారణ కొబ్బరి అన్నంతో పోలిస్తే దీని రుచి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కాస్త కారంగా, మసాలా ఫ్లేవర్ తో నోరూరించేలా ఉండే ఈ వంటకాన్ని పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో ఇష్టపడతారు. అన్నింటికన్నా ముఖ్యంగా, దీనిని తయారు చేయడం చాలా సులభం. ఉదయం పూట హడావిడిలో ఉండే ఉద్యోగస్తులకు, బ్యాచిలర్స్ కు అత్యవసర సమయాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రుచికరమైన మసాలా కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మసాలా రుబ్బుకోవడానికి:
పచ్చి కొబ్బరి తురుము: 3/4 కప్పు
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
పసుపు: చిటికెడు
వెల్లుల్లి రెబ్బలు: 2
కరివేపాకు: 1 రెమ్మ
తాలింపు మరియు కలపడానికి:
వండి, పొడిపొడిగా చేసిన అన్నం: 2 కప్పులు
నూనె: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: అర టీస్పూన్
మినపప్పు: 1 టేబుల్ స్పూన్
వేరుశెనగలు: 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ: అర
పచ్చిమిర్చి: 1
కరివేపాకు: 1 రెమ్మ
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి తురుము, కారం, ధనియాల పొడి, చిటికెడు పసుపు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయండి. ఇందులో చుక్క నీరు కూడా కలపకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి లేదా పాన్ పెట్టండి. అందులో నూనె పోసి, అది వేడెక్కాక ఆవాలు, మినపప్పు మరియు వేరుశెనగలు వేసి మంచి వాసన వచ్చేలా దోరగా వేయించండి.
తాలింపు చక్కగా వేగిన తర్వాత, సన్నగా తరిగిన సగం ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు చల్లి ఉల్లిపాయలు మెత్తబడి రంగు మారే వరకు బాగా వేయించండి. తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మసాలా మిశ్రమాన్ని ఇందులో వేయండి. మంటను తక్కువగా ఉంచి, మసాలా పచ్చి వాసన పోయి చక్కటి సువాసన వచ్చే వరకు సుమారు 5 నిమిషాల పాటు కలుపుతూ వేయించండి.
చివరగా, ముందుగానే వండి నీళ్ళు వార్చి పొడిపొడిగా ఉంచుకున్న అన్నాన్ని, రుచికి సరిపడా ఉప్పును ఇందులో వేసి, మసాలా అంతా ప్రతి మెతుకుకూ పట్టేలా నెమ్మదిగా బాగా కలపండి.
అంతే ఘుమఘుమలాడే, నోరూరించే మసాలా కొబ్బరి అన్నం వేడివేడిగా సిద్ధమైపోయింది. దీనిని పెరుగు పచ్చడి లేదా వేడివేడి అప్పడాలతో వడ్డిస్తే పిల్లలు ఒక్క మెతుకు కూడా వదలకుండా ఆస్వాదిస్తూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
