Latest Updates
-
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.!
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే!
కాలం ఏదైనా కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవడానికి ఫ్రిజ్‌లో ఉంచడం సర్వసాధారణం. అయితే ఫ్రిజ్‌లో పెట్టినంత మాత్రాన కూరగాయలు ఎక్కువ రోజులు అంతే తాజాగా ఉంటాయనుకుంటే పొరపాటే. కొన్ని కూరగాయలు కొంతకాలం తాజాగా ఉంటే.. మరికొన్ని త్వరగా పాడైపోతాయి. అయితే ఫ్రిజ్‌లో ఏవి ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. స్టోర్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. సింపుల్ టిప్స్ ఇక్కడ తెలుసుకుందాం..

మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను అలాగే ఫ్రిజ్‌లో ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని అనుకోవద్దు. టెంపరేచర్, తేమ, ప్యాకేజింగ్, ఎలాంటి వెజిటబుల్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ క్రమంలో ఏ రకం కూరగాయలు ఎక్కువ రోజులు ఉంటాయో చూద్దాం..
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.!
ఆకుకూరలు
తోటకూర, పాలకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర ఇలా పలు రకాల ఆకుకూరలు ఫ్రిజ్‌లో ఉన్నా, బయట ఉన్న త్వరగా పాడైపోతాయి. ఈ క్రమంలో వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయాలి. స్టోర్ చేసే ముందు పూర్తిగా శుభ్రం చేసి ఆరబెట్టుకోవాలి. ఆకుకూరల్లో తేమ ఉంటే త్వరగా పాడైపోయే అవకాశం ఉండటంతో వాటిని మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే వండుకోవడం మంచిది. ఆకుకూరలు జిగుటుగా మారడం, రంగు మారడం, ఘాటైన వాసన గమనిస్తే వాటిని తినకపోవడం మంచిది.

కూరగాయలు
క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బెండకాయలు, చిక్కుడు వంటి కూరగాయలు సరైన విధానంలో నిల్వ చేస్తే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. వాటిని ఫ్రిజ్‌లో వెజిటబుల్స్ అరల్లో నిల్వ చేయడం ద్వారా తాజాగా ఉంటాయి. గాలి ప్రసరణ సరిగా ఉండేలా ప్యాకేజింగ్ చేసి స్టోర్ చేయాలి. కూరగాయలను ముందుగానే తరిగి ఫ్రిజ్‌లో పెట్టుకోకుండా, అవసరమైనప్పుడు మాత్రమే కట్ చేసి వాడుకుంటే రుచిగా ఉంటాయి. ఇక, బంగాళాదుంపలు, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ఫ్రిజ్‌లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవాలి.
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'!
తరిగిన కూరగాయలు
వంట చేసేటప్పుడు సులువుగా ఉండేలా చాలా మంది కూరగాయలను ముందుగానే కట్ చేసి పెట్టుకుని నిల్వ చేసుకుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదు. త్వరగా బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశం ఉంటుంది. తరిగిన కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టాక గంటల వ్యవధిలోనే ఉపయోగించాలి. ఎక్కువ కాలం అలాగే ఉంటే పాడైపోవచ్చు. వండిన తర్వాత మిగిలిన వంటలను బయట అలాగే వదిలేయకుండా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తినేముందు గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత కాస్త వేడి చేసుకోవడం మంచిది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
