Latest Updates
-
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు!
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'!
తెలంగాణ నాన్‌వెజ్ వంటకాల్లో నాటుకోడి కర్రీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ నాటు కోడి కూర అంటే మసాలాలు నషాళానికి అంటాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. మీరూ నాటుకోడి కూరను ఆస్వాదించాలని ఆరాటపడుతుంటే ఈ సారి తప్పకుండా ఇలా అంకాపూర్ విలేజ్ స్టైల్‌లో ట్రై చేయండి. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు అనుభూతి చెందడం పక్కా. ప్లేట్ మొత్తం వదలకుండా లాగించేస్తారు.

అంకాపూర్ నాటుకోడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
నాటు కోడి కూర- అర కిలో
మసాలా దినుసులు
వేరుశనగ గుండ్లు- పావు కప్పు
ఎండు కొబ్బరి ముక్కలు- మూడు టేబుల్ స్పూన్లు
ధనియాలు- నాలుగు టీస్పూన్లు
మిరియాలు- అర టీస్పూన్
నూనె- 60మి.లీ
ఉల్లిపాయలు- రెండు
వెల్లుల్లి రెబ్బలు- పది
పచ్చిమిర్చి- నాలుగు
కరివేపాకు- మూడు రెబ్బలు
ఉప్పు- రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒకటిన్నర టేబుల్
స్పూన్
పసుపు- పావు టీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
కొత్తిమీర- గుప్పెడు
అంకాపూర్ నాటుకోడి కూర తయారీ విధానం
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ముందుగా స్టవ్‌పైన పాన్ పెట్టుకుని మసాలా కోసం సిద్ధం చేసి పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, జాపత్రి, కొన్ని ఏలకులు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క వేసి వేయించాలి. పల్లీలు, ఎండుకొబ్బరి ముక్కలు, ధనియాలు వేసి చిన్న మంటపైన దోరగా వేగనివ్వాలి.
ఇప్పుడు ఈ మసాలా దినుసులను మిరియాలతో పాటు మిక్సీ జార్‌లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
స్టవ్‌పైన మందపాటి కుక్కర్ పెట్టుకుని నూనె వేసి కాగిన తర్వాత కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి రంగు మారేవరకు వేయించండి. కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి.

తర్వాత నాటుకోడి కూర వేసి హై ఫ్లైమ్ పైన ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత కారం వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. కారం బాగా పట్టిన తర్వాత 300 మి.లీ నీళ్లు పోసుకుని కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మీడియం మంటపైన 5 నుంచి 7 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.!
విజిల్స్ పూర్తయి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. కూర ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ ముక్కలు ఉడకకపోతే మరో రెండు లేదా మూడు విజిల్స్ పెట్టుకోండి. తర్వాత అందులో సిద్ధం చేసుకున్న మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.
నూనె పైకి తేలిన తర్వాత ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అన్నం, లేదా జొన్న రొట్టెల్లోకి ఈ నాటు కోడి కూర రుచిని జీవితంలో మరిచిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
