Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మినుములతో ఇలా చేసుకొని తింటే..1000 ఏనుగుల బలం!
భారతీయ వంటిల్లు ఒక వైద్యశాల అయితే, అందులో ఉండే దినుసులు ఔషధాలు. అందులోనూ తెలుగు వారి సంప్రదాయంలో మినుములుకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ఎదుగుదలకు, ముఖ్యంగా ఆడపిల్లల ఆరోగ్యానికి మినుముల పాయసం చేసి పెట్టేవారు.
ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్ల మోజులో పడి ఇలాంటి బలవర్ధకమైన ఆహారాన్ని మనం మర్చిపోతున్నాం. శరీరాన్ని ఉక్కులా మార్చే శక్తి మినుములకు ఉంది. ఎంత నీరసంగమైన మనిషి కూడా మినుముల పాయసం రోజు ఒక కప్పు తాగితే వెంటనే లేచి ఉరకడం ఖాయం. అంత బలం ఇస్తుంది. మినుముల పాయసం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

మినుముల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినుములు
-బియ్యం
-బెల్లం
-పచ్చి కొబ్బరి తురుము
-బాదం
-జీడిపప్పు
మినుముల పాయసం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద లేదా పొయ్యి మీద బాండీ పెట్టి అందులో 1 కప్పు మినుములు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. మినుముల నుంచి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. తర్వాత అందులోనే 1 చెంచా బియ్యం వేసి(దించే ముందే బియ్యం వేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి)వేయించుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి.
-వేయించిన మినుములు,బియ్యం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
-ఒక గిన్నెలో గ్రైండ్ చేసుకున్న పొడి వేసి,ఇందులోనే ఒక కప్పు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో మూడు కప్పుల నీళ్లు పోపి వేడి చెయ్యాలి. వెడెక్కిన నీళ్లలో కలిపి ఉంచిన పిండి మిశ్రమం వేసి కలుపుకోవాలి. టక టక అనేదాకా కలుపుతూ ఉడికించాలి. చేత్తో పట్టుకుంటే మెత్తగా కరిగిపోతుండాలి.
-దగ్గర పడి ఉడికినప్పుడు అందులో ఒక కప్పు బెల్లం వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో రుచికి తగినట్లు పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకున్నాక అందులోనే సన్నగా కట్ చేసిన బాదం,జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకొని 1 నిమిసం తర్వాత స్టవ్ ఆపేయండి. అంతే మినుముల పాయసం రెడీ.
-వారానికి కనీసం ఒక్కసారైనా ఈ పాయసాన్ని బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్ గా తీసుకోవడం వల్ల కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications