Latest Updates
-
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే -
నోట్లో కరిగిపోయే గులాబ్ జామున్ కావాలా? అయితే స్వీట్ షాపుల సీక్రెట్ ఇదే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ తప్పులు చేస్తే బిడ్డకు ప్రమాదమేనా? -
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే!
పెసరపప్పు కోషాంబరి తయారీ ; హెసరు బేలే కోషాంబరిని ఎలా తయారు చేయాలి
పెసరపప్పు కోషంబరి కన్నడ భోజనంలో సంప్రదాయక సలాడ్ వంటకం. అన్ని పండగలప్పుడూ చేసే ఈ వంటకాన్ని హెసెరు బేలే కోషంబరి అని కూడా అంటారు. ఎలా తయారుచేస్తారో, ఈ వరుస పాయింట్ల ప్రకారం, చిత్రాలు ,వీడియో సాయంతో నేర్చ
కర్ణాటకలో పండగల సమయాల్లో చేసుకునే సంప్రదాయపు సలాడ్ వంటకం పెసరపప్పు కోషంబరి. ఇది కన్నడ భోజనంలో తప్పనిసరి. కోషాంబరి అనే ఈ సలాడ్ నానబెట్టిన పెసరపప్పు, క్యారెట్, దోసకాయ, పచ్చి మామిడి వంటి కూరగాయలతో తయారయ్యేది. ఇది, మహారాష్ట్ర సలాడ్ పెసరపప్పు కోషింబిర్ దాదాపు ఒకటే.
హెసరు బేలే కోషాంబరి సులువుగా, త్వరగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఈ సలాడ్ ను శాకాహారం డైట్ లో భాగంగా తీసుకోవచ్చు. ఈ ఆరోగ్యకర సలాడ్ ను ఇంట్లో తయారుచేయాలనుకుంటే కింద ఇచ్చిన తయారీ విధానాన్ని, బొమ్మలను, వీడియోను చూసి చేయండి.
పెసరపప్పు కోషంబరి తయారీ వీడియో
Recipe By: అర్చన వి
Recipe Type: సలాడ్
Serves: 2 కి
-
నానబెట్టిన పెసరపప్పు - 200 గ్రాములు
దోసకాయ (చెక్కుతీసి, తరిగినది) - మధ్యమ సైజులో సగం
క్యారెట్ (చెక్కుతీసి కోరినది ) - 1 మధ్యమ సైజుది
పచ్చి తోతాపురి మామిడి (తరిగినది) - పావు కప్పు
కొబ్బరి (కోరినది) - 2చెంచాలు
అల్లం ( ముక్కలు) - పావు అంగుళం పరిమాణం
పచ్చిమిర్చి ( ముక్కలు) - 1 చెంచా
నూనె - 1 చెంచా
ఆవాలు - 1చెంచా
ఇంగువ - పావు చెంచా
కరివేపాకు - 5-6
నిమ్మరసం - అరచెక్క నిమ్మకాయ
ఉప్పు తగినంత
కొత్తిమీర ( తరిగినది) - 1 చెంచా
-
1. నానబెట్టిన పెసరపప్పు ఒక గిన్నెలో తీసుకోండి.
2. దోసకాయ, క్యారెట్, పచ్చి మామిడిని వేయండి.
3. బ్బరి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలను వేయండి.
4. వేడి కడాయిలో నూనె వేసి,ఆవాలను వేయించండి.
5. వేగాక అందులో కరివేపాకు, ఇంగువను వేసి పోపును తయారుచేయండి.
6. ఆ పోపును సలాడ్ లో వేయండి.
7. నిమ్మరసం, ఉప్పు వేయండి.
8. అన్నిటినీ బాగా కలపండి.
9. కొత్తిమీరను పైన చల్లి మళ్ళీ బాగా కలపండి.
- 1. నానబెట్టేముందు పెసరపప్పును బాగా కడగాలి.
- 2. పెసరపప్పును గంటపాటు నానబెట్టి మిగిలిన నీళ్ళను పారబోయాలి.
- 3. నీరంతా బయటకి రాకుండా ఉండటానికి, ఉప్పును ఆఖరున వేయండి.
- సరిపోయే పరిమాణం - 1 కప్పు
- క్యాలరీలు - 87 క్యాలరీలు
- కొవ్వు - 4 గ్రాములు
- ప్రొటీన్లు - 4గ్రాములు
- చక్కెర - 6గ్రాములు
- ఫైబర్ - 3 గ్రాములు
- ఐరన్ - 6%
- విటమిన్ సి - 29%
స్టెప్ బై స్టెప్ - పెసర పప్పు కోషాంబరి తయారీ ఎలా
1. నానబెట్టిన పెసరపప్పు ఒక గిన్నెలో తీసుకోండి.
2. దోసకాయ, క్యారెట్, పచ్చి మామిడిని వేయండి.
3. బ్బరి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలను వేయండి.
4. వేడి కడాయిలో నూనె వేసి,ఆవాలను వేయించండి.
5. వేగాక అందులో కరివేపాకు, ఇంగువను వేసి పోపును తయారుచేయండి.
6. ఆ పోపును సలాడ్ లో వేయండి.
7. నిమ్మరసం, ఉప్పు వేయండి.
8. అన్నిటినీ బాగా కలపండి.
9. కొత్తిమీరను పైన చల్లి మళ్ళీ బాగా కలపండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






























