Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
మాతృదినోత్సవం (మదర్స్ డే) అనేది కేవలం ఒక రోజు మాత్రమే కాదు మన జీవితానికి ప్రాణం పోసి, మన ఎదుగుదల కోసం తన సంతోషాలను త్యాగం చేసిన అమ్మకు కృతజ్ఞతలు చెప్పే ఒక అందమైన పండుగ. అమ్మ ఎప్పుడూ మన కోసం ఎన్నో రకాల వంటలు చేసి పెడుతుంది. మరి ఈ మదర్స్ డే రోజున అమ్మ కోసం మనం స్వయంగా ఏదైనా చేసి పెడితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది.

బయట మార్కెట్లో దొరికే కేకులు సాధారణంగా మైదా, కల్తీ రంగులు, ఎక్కువ రసాయనాలతో కూడుకుని ఉంటాయి. వయసు పైబడుతున్న కొద్దీ అమ్మ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే మైదాకు బదులుగా ఆరోగ్యకరమైన బొంబాయి రవ్వతో ఎంతో రుచికరమైన, మృదువైన కేక్ చాలా తక్కవ సమయంలో ఈజీగా చేయవచ్చు. ఈ కేక్ చేయడానికి మనకు ఎటువంటి ఓవెన్, ఎగ్స్ (గుడ్లు) అవసరం లేదు. ఇంట్లో ఉండే సాధారణ పాత్రలు, పదార్థాలతోనే సులభంగా చేయవచ్చు.
రవ్వ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బొంబాయి రవ్వ
-గడ్డ పెరుగు
-చక్కెర
-నెయ్యి
-కాచి చల్లార్చిన పాలు
-ఈనో
-యాలకుల పొడి
-టూటీ ఫ్రూటీ
-సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్మిస్)

రవ్వ కేక్ తయారీ విధానం
-ముందుగా తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వను మిక్సీ జార్‌లో వేసి ఒక్క నిమిషం పాటు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ చాలా మృదువుగా, స్పాంజ్ లాగా వస్తుంది.
-ఒక మిక్సింగ్ బౌల్ లో అరకప్పు పెరుగు, అర కప్పు చక్కెర, 1 స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రవ్వ ద్రవాలను పీల్చుకుంటుంది కాబట్టి ఈ మిశ్రమంపై మూత పెట్టి కనీసం 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. రవ్వ ఎంత బాగా నానితే కేక్ అంత మెత్తగా వస్తుంది.
-తర్వాత మూత తీసి అందులో అర స్పూన్ యాలకల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే 1చిటికెడు ఫుడ్ కలర్, 1 ఈనో ప్యాకెట్ మొత్తం, ఇందులోనే కొంచెం పాలు వేసి మొత్తం బాగా కలుపుకోండి.
-ఇప్పుడు అందులోనే 50 గ్రాముల టూటీ ఫ్రూటీ వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కేకు టిన్ను లేదా అడుగు మందంగా ఉండే గిన్నెలోకి వేసుకోవాలి. కేకు టిన్నులో మిశ్రమాన్ని సమానంగా పరిచి పైన కొంచెం టూటీ ఫ్రూటీ, బాదం, కాజు వంటి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తురుము వేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోయండి. పాన్ లోనే చిన్న స్టాండ్ పెట్టుకోండి,ఈ స్టాండ్ మీద మిశ్రమం ఉన్న కేకు టిన్ను పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
-15 నిమిషాల తర్వాత మూత తీసి ఒక టూత్ పిక్ లేదా చాకును కేక్ మధ్యలో గుచ్చి చూడాలి. చాకుకు పిండి అంటుకోకుండా శుభ్రంగా వస్తే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్లు. లేదంటే మరో 5 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, కేక్ గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారాక చాకుతో అంచులు వదులు చేసి, ప్లేట్ లోకి బోర్లించి తీసుకుంటే ఎంతో సాఫ్ట్ అయిన రవ్వ కేక్ రెడీ. దీనిని మీకు నచ్చిన షేపులో కట్ చేసి మదర్స్ డే స్పెషల్ గా మీ తల్లికి తినిపిస్తే సూపర్ కన్నా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
