Latest Updates
-
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే..
ఎగ్ ఫ్రైడ్ రైస్ ని తలదన్నేలా.. ముంబై స్పెషల్ ఎగ్ తవా పులావ్..ఎలా చేసుకోవాలంటే
ముంబైలో వీధుల్లో దొరికే ఎగ్ తవా పులావ్ చాలా ప్రసిద్ధ వంటకం. తవా పులావ్ అంటే ప్రత్యేకమైన మసాలా దినుసుల మిశ్రమంతో, కూరగాయలతో, గుడ్డుతో కలిపి, వెడల్పాటి తవా (పెనం) మీద చేసే వంటకం. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలను కూడా అందిస్తుంది. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. ముంబై స్పెషల్ ఎగ్ తవా పులావ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఎగ్ తవా పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
-ఉడికించిన అన్నం- 1-2 కప్పులు
-గుడ్లు- 2-3
-నూనె లేదా వెన్న-2-3 టేబుల్ స్పూన్లు
-ఉల్లిపాయ-1
-అల్లంవెల్లుల్లి పేస్ట్-1 టీస్పూన్
-క్యారెట్, బఠాణీలు, క్యాప్సికమ్-సగం కప్పు
-టమాటో-1
-పావ్ భాజీ మసాలా లేదా గరం మసాలా-1.5 టీస్పూన్లు
-కారం-అర టీస్పూన్
-పసుపు-చిటికెడు
-ఉప్పు
-కొత్తిమీర
-నిమ్మకాయ రసం

తయారుచేసే విధానం
-ముందుగా బియ్యాన్ని బాగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఉడికించిన బియ్యం చల్లగా ఉంటే పులావ్ చేయడానికి మరింత అనుకూలంగా
ఉంటుంది.
-ముందుగా ఒక వెడల్పాటి పెనం మీద నూనె లేదా వెన్న వేసి వేడి చేయాలి.
-నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి.
-ఇప్పుడు తరిగిన కూరగాయల ముక్కలు (క్యారెట్, బఠాణీలు, క్యాప్సికమ్) వేసి కొద్దిగా మెత్తబడే వరకు వేగించాలి.
-ఆ తర్వాత టమాటో ముక్కలు, పసుపు, కారం, పావ్ భాజీ మసాలా లేదా గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. టమాటో ముక్కలు బాగా మెత్తబడే వరకు వేగించాలి.
-ఇప్పుడు ఉడికించిన గుడ్డు ముక్కలను వేసి నెమ్మదిగా కలపాలి.
-చివరగా ఉడికించిన అన్నం వేసి మసాలాతో బాగా కలిసేలా నెమ్మదిగా కలపాలి. ఒక నిమిషం పాటు వేగించి కొత్తిమీర తరుగు, నిమ్మకాయ రసం వేసి కలపాలి.
-వేడి వేడిగా పెరుగు రైతాతో లేదా సాదాగా వడ్డించుకోవచ్చు.
ప్రయోజనాలు
ఈ వంటకంలో గుడ్డులో ఉండే ప్రోటీన్లు, కూరగాయలలో ఉండే విటమిన్లు,
మినరల్స్ లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు అన్నీ
ఒకే వంటకంలో లభిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
