Latest Updates
-
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.!
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.!
ఇడ్లీలు అంటే సాధారణంగా మన స్టైల్‌లో రవ్వ ఇడ్లీలు, మిల్లెట్ ఇడ్లీలు మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైనా మన సౌత్ ఇండియన్ స్టైల్‌లోనే కాంచీపురం ఇడ్లీ ట్రై చేశారా.? బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా తమ డైట్‌లో ఈ ఇడ్లీలను చేర్చుకుంటారు. ఈ క్రమంలో కాంచీపురం ఇడ్లీలను కూడా ప్రయత్నించండి. ఈ టెంపుల్ స్టైల్ ఇడ్లీ రుచికి మీరు తప్పకుండా పడిపోవాల్సిందే.. కాంచీపురం ఇడ్లీ ఎలా తయారుచేయాలో చూద్దాం..

టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం- కప్పు(250 గ్రాములు)
మినప్పప్పు- కప్పు(250 గ్రాములు)
పెరుగు- నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు- టీస్పూన్
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
జీడిపప్పు- పావు కప్పు
నూనె- మూడు టీస్పూన్లు
ఆవాలు- టీస్పూన్
దంచిన నల్ల మిరియాలు- టేబుల్ స్పూన్
తరిగిన అల్లం- కొద్దిగా
ఇంగువ- టీస్పూన్
కరివేపాకు- కొద్దిగా
శొంఠిపడి- టీస్పూన్
టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ తయారీ విధానం
టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ తయారీ కోసం ముందుగా బియ్యాన్ని కడిగి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. అదే మాదిరిగా మినప్పప్పును కూడా కడిగి మూడు గంటల పాటు నాననివ్వాలి.
ఇప్పుడు నానబెట్టిన బియ్యంలో నీళ్లు తీసేసి మిక్సీ బౌల్ తీసుకుని అందులో బియ్యం వేసి మరీ మెత్తగా కాకుండా మరీ గరుకుగా కాకుండా రుబ్బుకోవాలి. కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుని ఒక వెడల్పాటి బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి.
తర్వాత మినప్పప్పులోని నీళ్లను తీసేసి మిక్సీ బౌల్‌లో వేసి కాస్త గరుకుగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బియ్యం పిండిలో కలుపుకోవాలి. దీనిని రాత్రి సమయంలో 8 గంటల పాటు పులియబెట్టాలి.

మరుసటి రోజు ఈ పులిసిన పిండి మిశ్రమాన్ని ఒకసారి కలిపి అందులో పెరుగు, ఉప్పు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన చిన్న బాణలి పెట్టుకుని అందులో నెయ్యి వేసి కాగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. వీటిని పిండిలో కలుపుకోవాలి.
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.!
అదే బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, దంచిన నల్ల మిరియాలు వేసి వేయించాలి. అందులోనే తరిగిన అల్లం, కరివేపాకు, శొంఠిపొడి, ఇంగువ వేసి కలిపి తాలింపు పూర్తయ్యాక పిండి మిశ్రమంలో కలపాలి.
ఒక పదినిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చిన్న బౌల్స్‌లో వేసుకోవాలి.

ఇడ్లీ పాత్రలో అడుగున కొన్ని నీళ్లు పోసుకుని స్టవ్‌పైన పెట్టుకుని కాగనివ్వాలి. ఇప్పుడు ఈ బౌల్స్‌ను స్టీమింగ్ ప్లేట్‌లో పెట్టుకుని ఇడ్లీ పాత్రలో ఉంచి మూత పెట్టి మీడియం మంటపైన 20 నిమిషాల పాటు ఉడికించాలి.
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.!
స్టవ్ ఆఫ్ చేసి కాసేపటి తర్వాత మూత తీసి ఇడ్లీలను సర్వ్ చేసుకోవడమే.. ఎవర్ గ్రీన్ టేస్ట్ కాంచీపురం ఇడ్లీ రెడీ.. ఈ ఇడ్లీలను రెగ్యులర్ పల్లీ చట్నీ కంటే ఉల్లిపాయ చట్నీతో తింటే ఆ స్సైపీనెస్‌కి ఒకటికి రెండు ఎక్కువ తినాల్సిందే..
బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ డైట్ ఇది. ఈ సారి ఖచ్చితంగా ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
