ప్రొటీన్‌ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్‌.!

గణేశ్‌ నవరాత్రులు మొదలయ్యాయి. ఈ రోజు నుంచి నిమజ్జనం జరిగే సెప్టెంబర్‌ 25 వరకు కొంత మంది నాన్‌వెజ్‌ తినరు. వెజ్‌ వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు. మరి అలాంటి వారికోసం సాదాసీదా వంటకాలు చేసి పెడితే ఎలా. ఆరోగ్యకరంగా ఉండేలా, పొట్ట నిండుగా, సంతృప్తి చెందేలా, ఎనర్జీ ఇచ్చేలా, చూడగానే నోరూరేలా ఉండే డిషెస్‌ని ఇష్టపడతారు. మరి అలాంటి హెల్తీ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది శనగల పులావ్‌. ఈ శనగల పులావ్‌ను ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం..

Nalla senagala pulao recipe with rich protein and nutrients process in telugu

శనగల పులావ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యం- పావు కేజీ
నల్ల శనగలు- పావు కేజీ
నూనె- టేబుల్‌ స్పూన్‌
నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు
మసాలా దినుసులు
ఉల్లిపాయ- ఒకటి(పెద్దది)
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
పచ్చిమిర్చి- మూడు
టమాటాలు- రెండు
ఉప్పు- టీస్పూన్‌
జీలకర్ర పొడి- టీస్పూన్‌
ధనియాల పొడి- టీస్పూన్‌
కారం- టీస్పూన్‌
గరం మసాలా పొడి- టీస్పూన్‌
పుదీనా ఆకులు- గుప్పెడు
కొత్తిమీర- గుప్పెడు

శనగల పులావ్‌ తయారీ విధానం

మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్‌ రైస్‌.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!

ముందుగా నల్ల శనగలను రెండు సార్లు కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వీటిని కుక్కర్‌లో వేసి కాస్త, ఉప్పు వేసి రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించుకోవాలి. శనగలు మెత్తగా ఉడికిన తర్వాత అందులోని నీటిని పారబోయకుండా వేరే గ్లాసులోకి తీసుకోండి. బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి గంటపాటు నానబెట్టుకోండి.

ఇప్పుడు స్టవ్‌పైన కుక్కర్‌ పెట్టుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్‌ చేసిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించుకోవాలి. పొడుగ్గా కట్‌ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత చిన్నగా కట్‌ చేసిన టమాటాలు వేసి ఉడికించాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి వేయించుకోండి.

Nalla senagala pulao recipe with rich protein and nutrients process in telugu

ఇప్పుడు ఉడికించిన శనగలు వేసుకుని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి. పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించండి.

ఈ టేస్ట్‌ నెవర్‌ బిఫోర్‌.. సండే స్పెషల్‌ పాలకూర చికెన్‌, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.!

మంచి సువాసన వస్తున్నప్పుడు విడిగా తీసుకున్న ఉడికించిన శనగల నీళ్లు, సాధారణ నీళ్లు కలిపి పావు లీటర్‌ వరకు పోసుకోండి. అలాగే నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలుపుకొని కుక్కర్‌ మూత పెట్టి మీడియం మంటపైన 8 నిమిషాల పాటు ఉడికించండి. లేదా రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉంచండి.

ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే ఘుమఘుమలాడుతూ శనగల పులావ్‌ రెడీ. దీనిని ఏదైనా గ్రేవీ, రైతాతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, September 14, 2026, 18:44 [IST]
Desktop Bottom Promotion