మొఘలాయ్‌ తవా చికెన్‌.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్‌ కూడా వదలకుండా తినేస్తారు.!

సండే వచ్చేసింది. ఇక నాన్‌వెజ్‌ ప్రియులు ఈ రోజు ఏం స్పెషల్‌ చేసుకుందామా అని థింక్‌ చేసేస్తుంటారు. ఎన్ని రకాల వెరైటీలు ఉన్నా చికెన్‌ ఉంటేనే ఆ మజా వేరు. ఇక తవా చికెన్‌ అంటే చెవులు కోసేసుకోవాల్సిందే. ఈ ఆదివారం మొఘలాయ్‌ తవా చికెన్‌తో అద్భుతమైన రుచిని ఆస్వాదించండి. ఈ స్టార్టర్‌ ట్రై చేసేట్పపుడు ఈ టిప్స్‌ ఫాలో అయ్యారంటే బోన్స్‌ కూడా వదలకుండా తినేస్తారు.

Mughlai tawa chicken recipe process do these after adding masala

మొఘలాయ్‌ తవా చికెన్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్‌- అర కేజీ
మిరియాల పొడి- అర టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
ధనియాల పొడి- అర టీస్పూన్‌
జీలకర్ర పొడి- అర టీస్పూన్‌
కారం- అర టీస్పూన్‌
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
నిమ్మరసం- అర చెక్క
ఉప్పు- టీస్పూన్‌
మీగడ పెరుగు- అర కప్పు
నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు
మసాలా దినుసులు
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- 12
బాదం- టేబుల్‌ స్పూన్‌
జీడిపప్పు- టేబుల్‌ స్పూన్‌
నల్ల మిరియాలు- అర టేబుల్‌ స్పూన్‌

మొఘలాయ్‌ తవా చికెన్‌ తయారీ విధానం

Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!

ముందుగా అరకేజీ లేత చికెన్‌ను తీసుకోవాలి. లేత చికెన్‌కి మసాలాలు బాగా పడతాయి. టేస్ట్‌ అద్భుతంగా ఉంటుంది. చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, నిమ్మరసం, ఉప్పు, పావు కప్పు మీగడ పెరుగు వేసి బాగా కలిపి గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టి మ్యారినేట్‌ చేయండి.

గంట తర్వాత స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వంటి మసాలా దినుసులు కొన్ని వేసి వేగాక పొడుగ్గా కట్‌ చేసిన ఉల్లిపాయ వేసి మగ్గించుకోండి.

Mughlai tawa chicken recipe process do these after adding masala

ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, బాదం, జీడిపప్పు, నల్లమిరియాలు వేసి మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేసి పావు కప్పు పెరుగు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

కేలరీస్‌ తక్కువ, ప్రొటీన్‌ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.!

ఇప్పుడు స్టవ్‌పైన తవా పెట్టుకుని నూనె, నెయ్యి వేసి కాగనివ్వాలి. తర్వాత మ్యారినేట్‌ చేసుకున్న చికెన్‌ వేసి కలపకుండా మూత పెట్టి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మరోవైపు చికెన్‌ ముక్కలను కాల్చుకోవాలి.

ఇలా దాదాపు, ఏడు నిమిషాల పాటు చికెన్‌ను వేయించుకున్న తర్వాత గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద వేసుకోవాలి. మసాలా మాడిపోకుండా వెంటనే కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా చేయడం ద్వారా చికెన్‌ ముక్కలకు మసాలాలు బాగా పడతాయి.

మధ్యమధ్యలో కలుపుతూ చికెన్ దగ్గరగా అయ్యే వరకు ఉడికిస్తూ ఉండాలి. చివర్లో టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, కాస్త ఫ్రెష్‌ క్రీమ్‌, కొన్ని బాదం, జీడిపప్పు పలుకులు, కొత్తిమీర వేసి కలిపి అడుగంటుతున్నప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే.

స్పైసీ టేస్ట్‌తో మొఘలాయ్‌ తవా చికెన్‌ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, October 4, 2026, 7:06 [IST]
Desktop Bottom Promotion