Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
టమాటాలు ఉడకబెట్టకుండా..నిమిషాల్లో నిల్వ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే
ఈరోజుల్లో మనం ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్నాం. ఇంట్లో ఏది చేసినా సరే, త్వరగా అయిపోవాలని చూస్తుంటాం. ఇలాంటి వారికి నిల్వ పచ్చళ్ళు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా, టమాటో నిల్వ పచ్చడి ఇంట్లో ఉంటే, వేడి వేడి అన్నంతో కలుపుకుని తినేయవచ్చు. ఇది అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ, పూరీ, చపాతీ వంటి వాటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. టమాటోలను ఉడికించే పనిలేకుండా నిమిషాల్లో అదిరిపోయే టేస్ట్ తో టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
టమాటో పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-చింతపండు
-టమాటోలు
-కరివేపాకు
-ఇంగువ
-మినపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-పచ్చి శెనగపప్పు
-ఎండుమిరపకాయలు
-వెల్లుల్లి
-వేయించి పొడి చేసిన మెంతుల పొడి
-వేయించి పొడి చేసిన ఆవ పొడి
-ఆయిల్
-కారం
-ఉప్పు
-పసుపు
టమాటో పచ్చడి తయారీ విధానం
-ముందుగా అరకేజీ బాగా పండి గట్టిగా ఉన్న టమాటోలను తీసుకోండి.
-టమాటోలను ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీజార్ లో వేసి, ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు,3 టేబుల్ స్పూన్ల కారం, 12 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నింటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లా చేసుకోవద్దు.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ముప్పావు కప్పు ఆయిల్ పోయండి.
-ఆయిల్ కాగిన తర్వాత అందులో 1 టీస్పూన్ పచ్చిశెనగపప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ మినపప్పు, 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేదాకా వేయించాక అందులోనే కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రెమ్మలు, 6 ఎండుమిరపకాయ ముక్కలు, 3రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువ,కొంచెం పసుపు వేసుకోవాలి.
-పోపు మెత్తం వేగిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని వేసి తక్కువ మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించాలి.
-పచ్చడి ఉడుకుతున్న సమయంలో వేయించి పొడి చేసిన మెంతుల పొడి పావు టీస్పూన్, వేయించి పొడి చేసిన ఆవ పొడి పావు టీస్పూన్ వేసి కలుపుకోవాలి.
-పచ్చడి ఉడికి ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసేయండి.
-పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఏదైనా డబ్బా లేదా సీసాలో నిల్వచేసుకుంటే వారం రోజులకు పైనే ప్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






