Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక!
ఉదయం నిద్ర లేవగానే గృహిణులకు మొదట వచ్చే ఆలోచన ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ కి ఏం వండాలి? అని. ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేనప్పుడు ఈ ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే మీ వంటగదిలో కొద్దిగా రాగి పిండి, బొంబాయి రవ్వ ఉంటే చాలు.. పిండి రుబ్బే పని లేకుండా నిమిషాల్లో వేడివేడిగా, దూదిలాంటి మెత్తని ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు.
వేసవి కాలంలో రాగిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం. ఇది శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించి, చలువ చేస్తుంది. పైగా రాగిలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి పిల్లల ఎదుగుదలకు ఇది అద్భుతంగా సహాయపడుతుంది. సాధారణంగా రాగి జావ అంటే ముఖం తిప్పుకునే పిల్లలు కూడా, ఇలా ఇడ్లీ రూపంలో చేసి పెడితే ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. దీనికి కాంబినేషన్‌గా కమ్మని కొబ్బరి చట్నీ ఉంటే ఆ రుచే వేరు.
రాగి ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు, మినపపప్పు - 1 టీస్పూన్ చొప్పున
పల్లీలు- 1 టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
బొంబాయి రవ్వ- 1 కప్పు
రాగి పిండి - 1 కప్పు
పుల్లటి పెరుగు - 1 కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
ఉప్పు - మీ రుచికి తగినంత
బేకింగ్ సోడా - 2 చిటికెలు
వేయించిన జీడిపప్పు - అలంకరణ కోసం
కొబ్బరి చట్నీ తయారీకి కావలసినవి
పచ్చి కొబ్బరి - అర చిప్ప
చిన్న ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
జీడిపప్పు - 5
ఉప్పు - తగినంత
తాలింపు కోసం: 1 టీస్పూన్ నూనె, ఆవాలు, మినపపప్పు, కరివేపాకు
రాగి ఇడ్లీ తయారుచేసే విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినపపప్పు, పల్లీలు వేసి దోరగా వేయించండి. అవి చిటపటలాడుతున్నప్పుడు పసుపు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి ఎర్రగా వేగనివ్వండి.
-ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసి 3 నిమిషాల పాటు సన్నని మంటపై వేయించండి. ఆ వెంటనే రాగి పిండి కూడా జతచేసి, మరో 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా వేయించుకుని, ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వండి.
-చల్లారిన పిండిలో 1 కప్పు పెరుగు, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపండి. తగినంత ఉప్పు వేసి కలిపి, మూతపెట్టి 15 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
-15 నిమిషాల తర్వాత పిండిలో 2 చిటికెల బేకింగ్ సోడా, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ఇడ్లీ పిండి జారుగా ఉండేలా కలుపుకోండి.
-ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, అలంకరణ కోసం మధ్యలో ఒక్కో వేయించిన జీడిపప్పును ఉంచండి. ఆ పైన పిండిని వేసి, ఇడ్లీ పాత్రలో పెట్టి 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించండి. అంతే దూదిలాంటి రాగి ఇడ్లీలు రెడీ.
కొబ్బరి చట్నీ తయారీ విధానం
-ఒక మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు, చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-తాలింపు కోసం చిన్న పాన్‌లో నూనె, ఆవాలు, మినపపప్పు, కరివేపాకుతో కమ్మటి పోపు పెట్టి చట్నీలో కలుపుకుంటే చాలు.
-వేడివేడి రాగి ఇడ్లీలను, ఈ కమ్మని కొబ్బరి చట్నీలో అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











