Latest Updates
-
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది!
ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి..
వంటలకు, ముఖ్యంగా డీప్ ఫ్రై చేయడానికి వేరుశెనగ నూనె (పల్లీ నూనె) బెస్ట్ అని మనందరికీ తెలుసు. అందులోనూ గానుగ నూనె వాడటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్లో స్వచ్ఛమైన గానుగ నూనె దొరకడం కష్టంగా మారిన ఈ రోజుల్లో ఎలాంటి మెషీన్ అవసరం లేకుండానే ఇంట్లో ఉండే మిక్సీతో స్వచ్ఛమైన పల్లీ నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, కేవలం 1 కిలో వేరుశెనగ గుళ్లతో ఏకంగా 400 గ్రాముల కల్తీలేని నూనెను మన చేతులతోనే తీసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

వేరుశెనగ నూనె తయారీకి కావాల్సినవి
వేరుశెనగ గుళ్లు - 1 కిలో
వేడి నీళ్లు - తగినంత
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే!
వేరుశెనగ నూనె తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి కడాయిలో ఎలాంటి నూనె వేయకుండా ఒక కిలో వేరుశెనగ గుళ్ళను దోరగా వేయించాలి. సన్నని మంట మీద గుళ్లపై ఉండే పొట్టు చిటపటలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి కొద్దిగా చల్లారాక, చేతులతో రుద్ది కానీ, లేదా ఒక కాటన్ వస్త్రంలో వేసి బాగా నలిపి కానీ పొట్టు తీసేయాలి. ఆ తర్వాత చాటలో చెరిగి పొట్టును పూర్తిగా వేరు చేయాలి.
-పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్ లో సగం వరకు వేసి గ్రైండ్ చేయాలి. ఒకేసారి కాకుండా మిక్సీని ఆన్, ఆఫ్ చేస్తూ పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత హై స్పీడ్ మీద మెత్తగా రుబ్బాలి. ఇలా చేస్తున్నప్పుడు పల్లీల నుండి సహజంగానే కొద్దిగా నూనె బయటకు రావడం మీరు గమనించవచ్చు. మొత్తం కిలో పల్లీలను ఇదే విధంగా గ్రైండ్ చేసి ఒక పెద్ద వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి స్టవ్ ఆపేయాలి.
-మరిగించి పెట్టుకున్న వేడి నీళ్లను పల్లీల మిశ్రమంలో కొద్దికొద్దిగా (రెండు స్పూన్ల చొప్పున) పోస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయకూడదు. వేడి నీళ్లు తగిలి పల్లీలు నూనెను వదలడం ప్రారంభిస్తాయి. రెండు చేతులతో గట్టిగా చపాతీ పిండిలా పిసుకుతూ ఉంటే కొద్దిసేపటికి నూనె బయటకు రావడం మీరే చూస్తారు.
-బయటకు వచ్చిన నూనెను ఒక సన్నని పలుచటి వస్త్రంలో కానీ, జల్లెడలో కానీ వేసి గట్టిగా పిండాలి. మిగిలిన పిండి ముద్దలో మళ్లీ కొద్దిగా వేడి నీళ్లు చల్లి గట్టిగా పిసుకుతూ మిగిలిన నూనెను కూడా తీయాలి. ఇలా చేయడం వల్ల దాదాపు 300 నుండి 400 గ్రాముల స్వచ్ఛమైన, కమ్మని వేరుశెనగ నూనె మీ ఇంట్లోనే రెడీ అవుతుంది.
-నూనె తీసేయగా మిగిలిన పల్లీల పిండిని పడేయాల్సిన అవసరం లేదు. అందులో పోషకాలు అలాగే ఉంటాయి. ఈ పిండిలో తగినంత తరిగిన బెల్లం లేదా పంచదార వేసి, కొద్దిగా వేయించిన నువ్వులు, యాలకుల పొడి కలిపి రుచికరమైన పల్లీ లడ్డూలు లేదా బర్ఫీలు తయారు చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
