Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
స్ట్రీట్ ఫుడ్ రుచి, అమ్మ చేతి ఆరోగ్యం..30 నిమిషాల్లో రెడీ అయ్యే కరకరలాడే మిల్లెట్ టిక్కీలు
సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపించడం సహజం. మనలో చాలామందికి స్ట్రీట్ ఫుడ్ అంటే మహా ఇష్టం. అందులోనూ వేడి వేడి ఆలూ టిక్కీ కనిపిస్తే అస్సలు ఆగలేం. కానీ, ఎప్పుడూ ఆలుగడ్డలేనా..బంగాళాదుంపలకు బదులుగా, పోషకాల గని అయిన మిల్లెట్స్ తో అద్భుతమైన టిక్కీలను తయారు చేసుకోవచ్చు.
చక్కరకి బదులుగా బెల్లం, మైదాకి బదులుగా జొన్న పిండి లేదా సజ్జ పిండి వాడుతున్నాం కాబట్టి ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఎంతో మేలు చేస్తుంది. కేవలం అరగంటలో తయారైపోయే ఈ క్రిస్పీ మిల్లెట్ టిక్కీలు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
జొన్న పిండి లేదా సజ్జ పిండి- 2 కప్పులు
బెల్లం తురుము - అర కప్పు
నీళ్లు - అర కప్పు
నువ్వులు - అర కప్పు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో అర కప్పు నీళ్లు, అర కప్పు బెల్లం తురుము వేసి వేడి చేయండి. ఇక్కడ మనకు తీగ పాకం రానవసరం లేదు, కేవలం నీటిలో బెల్లం పూర్తిగా కరిగితే చాలు. బెల్లం కరిగాక స్టవ్ ఆపేయండి.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో 2 కప్పుల జొన్న పిండి, నువ్వులు వేసి కలపండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న వేడి బెల్లం నీటిని కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ గరిటతో కలపండి.
-పిండి కాస్త చల్లారాక, చేత్తో బాగా పిసకండి. మిశ్రమం మరీ గట్టిగా కాకుండా, మరీ జారుగా కాకుండా చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. అవసరమైతే మరికొన్ని గోరువెచ్చని నీళ్లను జోడించి పిండిని ముద్దలా చేయండి. పిండి ఎంత బాగా కలిపితే టిక్కీలు అంత గుల్లగా వస్తాయి.
-పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత, చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. మీ అరచేతులకు కొద్దిగా నూనె రాసుకుని, ఈ ఉండలను బిళ్ళల్లా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా, కాస్త మందంగా ఉంటే తినేటప్పుడు రుచిగా ఉంటాయి.
-టిక్కీలను ఒత్తుకున్న తర్వాత వాటిపై మరికొన్ని నువ్వులను చల్లండి. ఇలా చేయడం వల్ల వేయించినప్పుడు అవి చూడటానికి అందంగా ఉంటాయి, తింటున్నప్పుడు పంటి కింద నువ్వులు తగులుతూ కమ్మగా ఉంటాయి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక మంటను మధ్యస్థంగా ఉంచి, టిక్కీలను ఒక్కొక్కటిగా నూనెలో వేయండి. రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోండి.
-మంట మరీ ఎక్కువగా ఉంటే పైన మాడిపోయి లోపల ఉడకదు, కాబట్టి ఓపికగా వేయించండి. అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే మిల్లెట్ టిక్కీలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications