Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్!
వేడి వేడి అన్నంలో, కరకరలాడే పరాఠాపై లేదా బ్రెడ్ టోస్ట్ పై కాస్త వెన్న (Butter) వేసుకుని తింటే ఆ మజాయే వేరు. వెన్న అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆవు పాలు లేదా గేదె పాలు. అయితే వెన్న తయారు చేయాలంటే పాలు కచ్చితంగా ఉండాలనేది ఒక పెద్ద అపోహ మాత్రమేనని మీకు తెలుసా?
పాలు లేకుండానే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వెన్నను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వెన్న తయారీకి మీకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో పాలు పడకపోవడం, కొలెస్ట్రాల్ భయాలతో చాలామంది వెన్నకు దూరమవుతున్నారు. అలాంటి వారి కోసం, అలాగే వీగన్ డైట్ ఫాలో అయ్యేవారి కోసం ప్లాంట్ బేస్డ్ బటర్ రెసిపీ పర్ఫెక్ట్ . ఇది పూర్తిగా కొలెస్ట్రాల్ రహితమైనది, లాక్టోస్ లేనిది.

పాలు లేని బటర్ తయారీకి కావలసిన పదార్థాలు
పుచ్చకాయ గింజలు- 2 టీస్పూన్లు
వంటకు వాడే కొబ్బరి నూనె- వెన్న గడ్డకట్టడానికి
కనోలా నూనె (లేదా ఏదైనా ఫ్లేవర్ లేని నూనె)- ఆరోగ్యకరమైన కొవ్వుల
కోసం
పసుపు - చిటికెడు
నిమ్మరసం - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - కొద్దిగా
పాలు లేని బటర్ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ గిన్నెలో రెండు టీస్పూన్ల పుచ్చకాయ గింజలను వేయండి. దానికి తగినన్ని నీళ్లు పోసి, మెత్తగా క్రీమ్ లాగా మారేంత వరకు బ్లెండ్ చేయండి. ఇప్పుడు అచ్చం పాల లాంటి చిక్కటి మిశ్రమం తయారవుతుంది. ఈ రెసిపీలో మనం ఆవు పాలకు బదులుగా ఈ పోషకాలు నిండిన పుచ్చకాయ గింజల మిశ్రమాన్నే బేస్ గా ఉపయోగిస్తాం.
-ఇప్పుడు పుచ్చ గింజల మిశ్రమంలో కనోలా నూనె,కొబ్బరి నూనె, చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు జోడించండి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మరోసారి బాగా బ్లెండ్ చేయండి. నూనెలు, గింజల పాలు అన్నీ కలిసి అద్భుతమైన క్రీమీ టెక్స్చర్ కు మారుతాయి.
-ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గాలి చొరబడని గాజు సీసాలో లేదా కంటైనర్ లో పోసి గడ్డకట్టే వరకు ఫ్రిజ్ లో ఉంచండి.
-అంతే ఎంతో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన డెయిరీ-ఫ్రీ వెన్న రెడీ. మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి కొనే బ్రాండెడ్ వెన్న కంటే ఇది చాలా చౌక. పైగా ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్, రసాయనాలు లేవు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
-ఈ పోషకాలు అధికంగా ఉండే వెన్నను రోటీ, పరాఠా, శాండ్ విచ్ లతో వడ్డించండి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications