Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
డీప్ ఫ్రై లేదు,రుచిలో తగ్గేదే లేదు..చుక్క నూనె లేకుండానే కరకరలాడే పొటాటో కట్లెట్స్
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం చేయాలి? లేదా సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడిగా, రుచిగా ఏం పెట్టాలి? అనే ప్రశ్న ప్రతి ఇల్లాలిని వేధిస్తుంటుంది. అయితే రుచికరమైన స్నాక్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలే. కానీ ఆరోగ్యానికి ఇవి మంచివి కావు.
వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటూ, రుచి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి నాన్ ఫ్రైడ్ పొటాటో కట్లెట్స్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ కట్లెట్స్ కడుపుకు ఎంతో తేలికగా ఉంటాయి. ఉడికించిన కూరగాయలు కూడా ఇందులో చేర్చడం వల్ల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంచే బంగాళాదుంప కట్లెట్స్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పొటాటో కట్లెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన బంగాళాదుంపలు - 4
ఉడికించిన బఠానీలు, క్యారెట్, బీన్స్- అర కప్పు
బ్రెడ్ స్లైసెస్ - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ లేదా శనగపిండి -2 టీస్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు -సరిపడా
నూనె - 1 టేబుల్ స్పూన్
పొటాటో కట్లెట్స్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసి ఉండలు లేకుండా మెత్తగా మాష్ (గుజ్జులా) చేయండి.
-మెత్తగా మాష్ చేసిన బంగాళదుం మిశ్రమంలో ఉడికించిన కూరగాయల ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
-కట్లెట్స్ చేసేటప్పుడు అవి విడిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం మిక్సీ గిన్నెలో బ్రెడ్ స్లైసెస్ వేసి వాటిని పొడిలా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పొడిని,అలాగే కార్న్‌ఫ్లోర్ లేదా శనగపిండిని బంగాళదుంప మిశ్రమంలో వేసి గట్టి ముద్దలా కలుపుకోవాలి.
-ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, తయారుచేసుకున్న మిశ్రమం నుండి చిన్న చిన్న ఉండలుగా తీసుకుని టిక్కీల్లాగా ఒత్తుకోవాలి.
-మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే, అందులో ఈ కట్లెట్స్ ను ఉంచి తక్కువ ఉష్ణోగ్రత వద్ద రెండు వైపులా కాల్చుకోవచ్చు. దీనివల్ల నూనె చుక్క లేకుండానే కట్లెట్స్ రెడీ.
-మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే..స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి వేడి చేయండి. కేవలం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పాన్ అంతటా రాసి తయారు చేసి పెట్టుకున్న పొటాటో టిక్కీలను పాన్ మీద ఉంచి, మంటను తక్కువలో ఉంచి రెండు వైపులా తిప్పుతూ, కట్లెట్స్ మంచి కలర్ వచ్చి, కరకరలాడే వరకు కాల్చుకోవాలి.
-అంతే వేడివేడి నాన్ ఫ్రైడ్ పొటాటో కట్లెట్స్ రెడీ. వీటిని పుదీనా చట్నీతో గానీ, టొమాటో కెచప్‌తో గానీ తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
