Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కేవలం 15 నిమిషాల్లో రెడీ!
రోజూ తినే ఆ తెల్లటి మినపప్పు, బియ్యం ఇడ్లీలు తిని బోర్ కొట్టిందా? రాత్రిపూట పప్పు నానబెట్టడం మర్చిపోయామని టెన్షన్ పడుతున్నారా? అయితే అవేవీ చేయకుండానే అప్పటికప్పుడు చేసుకోగలిగిన అద్భుతమైన, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ. ఇది కేవలం రుచికరమైనదే కాదు, ప్రోటీన్లతో నిండిన పవర్ హౌస్ లాంటి బ్రేక్ ఫాస్ట్.
బరువు తగ్గాలనుకునే వారికి, పోషకాలతో కూడిన కొత్తరకం వంటకాల కోసం వెతికే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. పెసరపప్పు శరీరానికి చలవ చేయడమే కాకుండా చాలా త్వరగా జీర్ణమవుతుంది. దీనికి తాజా కూరగాయలు కూడా తోడైతే అది ఒక పరిపూర్ణమైన సమతుల్య ఆహారంగా మారుతుంది. పప్పు నానిన తర్వాత కేవలం 15 నిమిషాల్లో ఈ ఇడ్లీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - 1 కప్పు
బియ్యం - పావు కప్పు
పెరుగు - అర కప్పు
కూరగాయలు: క్యారెట్, ఎరుపు,ఆకుపచ్చ క్యాప్సికమ్, టమాటా
పచ్చిమిర్చి - 2
అల్లం తరుగు - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
పోపు కోసం: ఆవాలు, కరివేపాకు, నూనె 2 స్పూన్లు
బేకింగ్ సోడా లేదా ఈనో- అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పెసరపప్పు వెజిటేబుల్ ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా పెసరపప్పు, బియ్యాన్ని కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్ లో వేయాలి. దానికి అర కప్పు పుల్లటి పెరుగు జతచేసి, ఇడ్లీ పిండిలా కొంచెం గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. పిండి పలచబడకుండా చూసుకోవాలి.
-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ రంగురంగుల కూరగాయలు ఇడ్లీకి అదనపు రుచిని, పోషకాలను ఇస్తాయి.
-స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక.. ఆ పోపును ఇడ్లీ పిండిలో కలపండి. తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేయండి.
-ఇడ్లీలు పెట్టే ముందు పిండిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా లేదా ఈనో వేసి సున్నితంగా కలపాలి.
ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా నూనె రాసి, పిండిని అందులో నింపి మీడియం మంట మీద 12-15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. టూత్ పిక్ గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే.. వేడివేడి ఇడ్లీలు రెడీ.
మిగిలిపోయిన ఇడ్లీలను తాజాగా మార్చుకోండిలా..
ఇడ్లీలు మిగిలిపోతే వాటిని ఫ్రిజ్ లో ఉంచండి. మళ్లీ
తినాలనుకున్నప్పుడు ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, పైన జల్లెడ పెట్టి
అందులో ఇడ్లీలను ఉంచండి. మూతపెట్టి 2 నిమిషాలు ఆవిరి పడితే చాలు..
అప్పుడే చేసినట్లుగా మెత్తగా మారిపోతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
