Latest Updates
-
ప్రోటీన్లు పుష్కలంగా ఉండే క్యాబేజీ పల్లీ రైస్.. లంచ్ బాక్స్ లోకి ఈజీగా.. అమృతం టేస్ట్! -
భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారని తెలిపే గ్రీన్ ఫ్లాగ్స్.. ఇవి మీ బంధంలో ఉన్నాయా.? -
మళ్లీ ప్రాణం పోసుకున్న రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు! -
మంగుళూరు స్పెషల్ ఘీ మసాలా రవ్వ దోశ.. ఇలా చేస్తే అచ్చం హోటల్ రుచి పక్కా! -
ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు, బూజు.. వీటిని తినడం సురక్షితమేనా.? -
అమ్మ పెళ్లి కుదిర్చిందని గుండు గీయించుకున్న యువతి.. నెట్టింట వైరల్.. పుకారా, నిజమా.? -
చిన్నారుల ఫేవరెట్.. లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే రసం రైస్.. కొత్తగా ఇలా చేయండి.! -
భాగస్వామితో గొడవైనప్పుడు పొరపాటున కూడా ఇలా చేయకండి.! -
‘తక్షణ మెరుపు’ అపోహ.. చర్మ సంరక్షణలో అతివలు చేస్తున్న అతిపెద్ద తప్పులు ఇవే.! -
ఫోలిక్ యాసిడ్ ఒక్కటే కాదు.. కాబోయే తల్లికి అత్యవసరమయ్యే పోషకాలు ఇవే.!
పప్పు నానబెట్టకుండా,రుబ్బకుండా..అప్పటికప్పుడు నోట్లో కరిగిపోయే రవ్వ పెరుగు ఇడ్లీ..ఎలా చేసుకోవాలో చూడండి
సాంప్రదాయ పద్ధతిలో ఇడ్లీ చేయాలంటే.. ముందురోజు బియ్యం, మినపపప్పు నానబెట్టాలి, ఆ తర్వాత గ్రైండర్లో రుబ్బాలి, రాత్రంతా పులియబెట్టాలి. ఉరుకుల పరుగుల జీవితంలో అంత సమయం, ఓపిక లేని వారు ఇన్ స్టంట్ రవ్వ పెరుగు ఇడ్లీ ట్రై చేయండి.
ఎలాంటి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు బొంబాయి రవ్వ, పెరుగు కాంబినేషన్ తో చేసే ఇడ్లీలు అచ్చం హోటల్ స్టైల్ లో స్పాంజ్ లా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి.

రవ్వ పెరుగు ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ (సూజీ) - 2 కప్పులు
పుల్లటి పెరుగు - ఒకటిన్నర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఈనో పౌడర్ లేదా బేకింగ్ సోడా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
రవ్వ పెరుగు ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల బొంబాయి రవ్వ వేయండి. మంటను సిమ్ లో ఉంచి రవ్వ రంగు మారకుండా కేవలం పచ్చివాసన పోయేలా 2 నిమిషాల పాటు వేయించండి. వేయించిన రవ్వను ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
-రవ్వ చల్లారిన తర్వాత అందులో ఒకటిన్నర కప్పు పుల్లటి పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం సాధారణ ఇడ్లీ పిండిలా ఉండాలి, మరీ నీళ్లలా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. రవ్వ నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది కాబట్టి పిండిపై మూతపెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-20 నిమిషాల తర్వాత పిండి కాస్త గట్టిపడితే కొద్దిగా నీళ్లు కలపండి. ఇడ్లీలు అచ్చుల్లో వేయడానికి సరిగ్గా ముందు.. పిండిలో 1 టీస్పూన్ ఈనో లేదా బేకింగ్ సోడా వేసి, దానిపై ఒక టీస్పూన్ నీరు పోయండి. అది బుడగల్లా రాగానే పిండిని సున్నితంగా ఒకే దిశలో కలపాలి. ఈనో వేసిన తర్వాత పిండిని అతిగా లేదా వేగంగా కలపకూడదు, అలా చేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయి.
-ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని అచ్చుల్లో పోయండి. ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగించి, ఈ ప్లేట్లను అందులో పెట్టి మీడియం మంటపై 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, వెంటనే కాకుండా ఓ 2-3 నిమిషాలు ఆగి ఇడ్లీలను బయటకు తీయండి.
-ఈ ఇడ్లీలకు మరింత రుచిని జోడించాలనుకుంటే.. ఒక చిన్న కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకుని పిండిలో కలుపుకోవచ్చు.
-అంతే గుమగుమలాడే, మృదువైన ఇన్ స్టంట్ రవ్వ పెరుగు ఇడ్లీలు రెడీ. వేడివేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటుంటే అదిరిపోతుందంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications