Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
స్వీట్ తినాలనిపించినప్పుడల్లా స్వీట్ షాపుకి వెళ్లి ఏదో ఒకటి కొనుక్కొని తింటున్నారా? బయట దొరికే స్వీట్లు, పంచదారతో చేసినవి తింటే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకే అటు ఆరోగ్యంతో పాటే సూపర్ టేస్ట్ ని అందించే స్వీట్లలో నువ్వులు బాదం లడ్డు ఫస్ట్ ఫ్లేస్ లో ఉంటుంది.
మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచే అద్భుతమైన, ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీ ఇది. దీనిని తయారు చేయడం చాలా సులువు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే నువ్వులు బాదం లడ్డు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

నువ్వుల బాదం లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
తెల్ల నువ్వులు - 1 కప్పు
బాదం పప్పులు - అర కప్పు
బెల్లం - ¾ కప్పు
నెయ్యి - 1 చిన్న కప్పు
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
నువ్వులు బాదం లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోండి. మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి, తెల్ల నువ్వులను దోరగా, కరకరలాడేలా వేయించుకోండి. మాడిపోకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కరిగాక అందులో తురిమిన బెల్లం, అలాగే సన్నగా తరిగిన బాదం ముక్కలు వేయండి. మంటను సిమ్ లోనే ఉంచి, బెల్లం కరిగి మిశ్రమం అంతా లేత బంగారు రంగు వచ్చే వరకు గరిటెతో తిప్పుతూ నెమ్మదిగా ఉడికించండి. బెల్లం కరిగి పాకంలా తయారయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసి బాగా కలపండి.
-బెల్లం పాకం, నువ్వులు, బాదం అన్నీ ఒకదానికొకటి అతుక్కునేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరీ చల్లారనివ్వకూడదు. కాస్త వేడిగా ఉన్నప్పుడే కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న బైట్స్ లేదా లడ్డూల్లాగా చుట్టుకోవాలి.
-వాటిని ఒక ప్లేట్లో ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంచండి.
-అవి పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడి, కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. అంతే ఎంతో రుచికరమైన నువ్వులు బాదం లడ్డు రెడీ. రోజుకొకటి తింటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
