Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ప్రోటీన్, క్యాల్షియం గని ఈ లడ్డు..రోజుకొక్కటి తింటే మీ శరీరానికి కొండంత బలం!
వేసవికాలంలో ఎండల తీవ్రత వల్ల శరీరంలోని శక్తి అంతా క్షీణించినట్లు, త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ టైంలో శరీరానికి తక్షణ శక్తినిచ్చే తేలికపాటి ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. వేసవిలో మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచే అద్భుతమైన రెసిపీ గోధుమపిండి పుట్నాల డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక లడ్డూ తింటే చాలు, మీ శరీరానికి కావాల్సిన పూర్తి శక్తి అందుతుంది.

గోధుమపిండి పుట్నాల డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - 2 కప్పులు
వేయించిన శనగలు (పుట్నాలు లేదా పొట్టు తీసినవి) - 2 కప్పులు
నెయ్యి - ముప్పావు కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
బాదం పప్పు - అర కప్పు
జీడిపప్పు - పావు కప్పు
పిస్తా పప్పు - 2 టేబుల్ స్పూన్లు
మఖానా (తామర గింజలు) - 1 కప్పు
తెల్ల నువ్వులు - పావు కప్పు
ఎండుద్రాక్ష (కిస్మిస్) - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - 1 టీస్పూన్
గోధుమపిండి పుట్నాల డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం
-ముందుగా వేయించిన శనగలను (పుట్నాలను) మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి మఖానా, తెల్ల నువ్వులను వేర్వేరుగా వేసి సన్నపు మంటపై దోరగా వేయించుకోవాలి. మఖానా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బరకగా కొద్దిగా పలుకులుగా ఉండేలా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక గోధుమ పిండి వేసి తక్కువ మంటపై 12-15 నిమిషాల పాటు వేయించాలి. పిండి మంచి బంగారు రంగులోకి మారి కమ్మటి వాసన వస్తుంది. గోధుమ పిండి చక్కగా వేగిన తర్వాత అందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడి, మఖానా పొడి, నువ్వులు, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసి మరో 2-3 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి.
-మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో తురిమిన బెల్లం, ఎండుద్రాక్ష, యాలకుల పొడి వేసి చేత్తో బాగా కలపాలి. నెయ్యి, బెల్లం పిండికి పట్టి ముద్దలా అవుతున్నప్పుడు, మీకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన గోధుమపిండి పుట్నాల డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు
-గోధుమ పిండి, నెయ్యి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రోజంతా అలసట లేకుండా ఉంచుతాయి.
-పుట్నాలలో (వేయించిన శనగలు) మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కండరాలను దృఢంగా ఉంచడమే కాకుండా పొట్ట నిండిన భావనను ఇస్తుంది.
-మఖానా, నువ్వులలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలు, కీళ్ల నొప్పులను నివారించడంలో సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
