Latest Updates
-
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు..
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!
వేసవి కాలం వచ్చేసింది. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి మండుటెండల్లో బయటకి వెళ్లి వస్తే గొంతు ఎండిపోయి, ప్రాణం నీటి కోసం విలవిలలాడుతుంది. ఆ సమయంలో చల్లగా, కమ్మగా ఏదైనా గొంతులో పడితే ఎంత హాయిగా ఉంటుందో. వేసవి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పానీయాల్లో లస్సీ ఒకటి. కమ్మటి పెరుగుతో చేసే లస్సీ దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని, అద్భుతమైన తాజాదనాన్ని ఇస్తుంది.

అయితే బయట దొరికే లస్సీలో లేదా మనం ఇంట్లో చేసుకునే సాధారణ లస్సీలో రుచి కోసం విపరీతంగా పంచదార కలుపుతారు. పంచదార రుచిని పెంచినప్పటికీ, అది మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అది బరువు పెరగడానికి, నీరసానికి దారి తీస్తుంది. మరి ఆరోగ్యంగా, అంతే రుచిగా షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ ట్రై చేయండి.
వేసవిలో పుదీనా ఒక సంజీవని లాంటిది. ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. కడుపులో మంటను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్, పుదీనాలోని తాజాదనం, బెల్లం లేదా తేనెలోని సహజమైన తీయదనం అన్నీ కలిపి ఈ పానీయాన్ని ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్ గా మారుస్తాయి.
పుదీనా లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు
చిక్కటి పెరుగు - 2 కప్పులు
తీయదనం కోసం -బెల్లం లేదా తేనె
పుదీనా ఆకులు - అర కప్పు
వేయించిన సోంపు పొడి - 1 టీస్పూన్
బ్లాక్ సాల్ట్ - చిటికెడు

పుదీనా లస్సీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో శుభ్రం చేసి పెట్టుకున్న తాజా పుదీనా ఆకులను వేయండి. దానికి రెండు మూడు స్పూన్ల పెరుగును జత చేసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పుదీనా ఆకులు ఎక్కడా తగలకుండా పెరుగులో బాగా కలిసిపోతాయి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో మిగిలిన చిక్కటి పెరుగును వేయండి. దీనికి
మంచి సువాసన కోసం వేయించిన సోంపు పొడిని, తీయదనం కోసం బెల్లం లేదా
తేనెను జోడించండి. అలాగే చిటికెడు నల్ల ఉప్పును కూడా కలపండి.
చివరగా ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్, కొద్దిగా చల్లటి నీరు పోసి సుమారు
ఒక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేయండి.
-మిక్సీలో బ్లెండ్ చేస్తున్నప్పుడు పైన అందమైన, చిక్కటి నురుగు రావడం మొదలవుతుంది. ఆ నురుగు పైకి రాగానే మీ పర్ఫెక్ట్ పుదీనా లస్సీ సిద్ధమైనట్లే.
-తయారైన ఈ చల్లటి పుదీనా లస్సీని అందమైన గాజు గ్లాసులో పోసి, పైన రెండు పుదీనా ఆకులతో అలంకరించి వడ్డించండి. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications