Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా..
తెలుగు లోగిళ్లలో వేసవి అడుగుపెట్టిందంటే చాలు, మామిడికాయ ఊరగాయల సందడి మొదలవుతుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, మామిడికాయ పచ్చడితో కలిపి తింటుంటే ఆ రుచే వేరు. పప్పు అన్నం, పెరుగన్నం, కిచిడీ లేదా వేడి వేడి పరాటాలు.. ఇలా ఏ భోజనంలోకైనా మామిడికాయ ఊరగాయ తోడైతే, ఎంత సాదాసీదా భోజనమైనా అమృతంలా మారిపోతుంది. ఊరగాయల ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపిస్తుంటే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరక మానవు.

అయితే సంప్రదాయ పద్ధతిలో మామిడికాయ ఊరగాయను తయారు చేయడం కొంచెం శ్రమతో, సమయంతో కూడుకున్న పని. ముక్కలు కోసి, మసాలాలు పట్టించి, ఎండలో పెట్టి.. ఆ పచ్చడి ఊరే వరకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. పచ్చడి ఎప్పుడెప్పుడు ఊరుతుందా, ఎప్పుడు రుచి చూద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం. కానీ ఎండతో పనిలేకుండా, రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండానే అప్పటికప్పుడు ప్రెషర్ కుక్కర్ మామిడికాయ పచ్చడి రెడీ చేసుకోవచ్చు.
ప్రెషర్ కుక్కర్ మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సినవి
-ధనియాలు
-సోంపు
-మిరియాలు
-జీలకర్ర
-ఆవాలు
-పచ్చి మామిడికాయలు
-ఉప్పు
-ఇంగువ
-కారం
-మెంతులు
-పసుపు
-మస్టర్డ్ ఆయిల్(ఆవ నూనె)
ప్రెషర్ కుక్కర్ మామిడికాయ పచ్చడి తయారీ విధానం
-ముందుగా ఒక పాన్ లేదా బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టండి. అందులో కొద్దిగా ధనియాలు, సోంపు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి సన్నని మంటపై దోరగా వేయించండి.
-వేయించినవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి కాస్త బరకగా రుబ్బుకోండి. మీకు రోలు, రోకలి అందుబాటులో ఉంటే అందులో దంచుకుంటే పచ్చడి రుచి మరింత అద్భుతంగా, అచ్చం అమ్మమ్మల కాలం నాటి రుచిని తలపిస్తుంది.
-పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి, మీకు నచ్చిన పరిమాణంలో ముక్కలుగా కోసుకోండి. ఈ ముక్కల మీద కొద్దిగా పసుపు చల్లి, ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో పసుపు పట్టిన మామిడికాయ ముక్కలను వేయండి. దానికి తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ, కారం పొడి కలపండి. ఆ వెంటనే మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడి మసాలా పొడిని కూడా వేయండి. చివరగా, ముందే వేడి చేసి పెట్టుకున్న ఆవ నూనె (మస్టర్డ్ ఆయిల్)ను ఇందులో పోయండి. నూనె, మసాలాలు మామిడి ముక్కలకు బాగా పట్టేలా గరిటెతో కలపండి.
-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతపెట్టి, ఉడకనివ్వండి. సరిగ్గా ఒక్క విజిల్ రాగానే స్టవ్ ఆపేయండి.
-తర్వాత మూత తీసి చూస్తే మామిడికాయ ఊరగాయ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
