అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్‌ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా..

Posted By:

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వంట చేయడానికి గంటల తరబడి సమయం కేటాయించడం కష్టమే. అలాంటప్పుడు త్వరగా, కడుపు నిండా, రుచికరంగా ఏదైనా తినాలనిపిస్తే చాలామందికి ముందుగా గుర్తొచ్చే ఆప్షన్ శాండ్‌విచ్. ఉదయం హడావిడిలో బ్రేక్‌ ఫాస్ట్ అయినా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ అయినా లేదా సాయంత్రం వేడి వేడి టీతో పాటు స్నాక్స్ లాగా అయినా.. శాండ్‌ విచ్ పర్ఫెక్ట్‌ గా సరిపోతుంది.

పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడతారు. కేవలం నిమిషాల వ్యవధిలో, మనకు నచ్చిన రుచులతో దీనిని చిటికెలో తయారు చేసుకోవచ్చు. బయట దొరికే వాటికంటే ఇంట్లో చేసుకునే శాండ్‌ విచ్ ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే, ఇందులో మనం తాజా కూరగాయలు వాడుతాం, వెన్నను మనకు తగినట్లుగా వేసుకుంటాం. మన వంటింట్లో ఉండే సాధారణ వస్తువులతోనే అద్భుతమైన శాండ్‌ విచ్‌ ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

No Time to Cook Make This Quick Tasty Veg Sandwich in Just Minutes Recipe in Telugu

శాండ్ విచ్ తయారీకి కావలసిన పదార్థాలు

-బ్రెడ్ స్లైస్‌ లు
-బంగాళదుంపలు
-ఉల్లిపాయలు
-టమాటాలు
-కీర దోసకాయలు
-పచ్చిమిర్చి
-ఉప్పు
-మిరియాల పొడి
-చాట్ మసాలా
-చీజ్ స్లైస్
-వెన్న లేదా మయోన్నైస్
-గ్రీన్ చట్నీ
-టమాటా కెచప్

శాండ్ విచ్ తయారీ విధానం

-ముందుగా కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడిగి, సన్నని గుండ్రటి ముక్కలుగా కోసి పెట్టుకోండి.

-ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా మాష్ చేసి, అందులో సరిపడా ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసి కలుపుకోండి. కారం ఇష్టపడేవారు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు.

-ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని, దానికి కొద్దిగా వెన్న లేదా మయోనీస్ రాయండి. దీనిపై ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంపల మిశ్రమాన్ని సమానంగా పరచండి. ఆ పైన ఉల్లిపాయ, టమాటా, కీర దోసకాయ ముక్కలను అందంగా పేర్చండి. వాటిపై కొద్దిగా చాట్ మసాలా చల్లి, చీజ్ స్లైస్ ఉంచి.. మరో బ్రెడ్ ముక్కతో కప్పేయండి. అంతే శాండ్‌ విచ్ రెడీ.

-ఇది బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండాలంటే, పాన్ మీద లేదా శాండ్‌ విచ్ మేకర్‌లో కొద్దిగా వెన్న రాసి దోరగా కాల్చుకోండి.

-మీ శాండ్‌ విచ్ బేకరీలో కొన్నట్లుగా పర్ఫెక్ట్ రుచి రావాలంటే తాజా బ్రెడ్‌ నే వాడండి. కూరగాయలను మరీ మందంగా కోయకుండా పలుచగా కోస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. వెన్నను మరీ ఎక్కువగా వాడకండి. పాన్ మీద కాల్చేటప్పుడు తక్కువ మంట మీద వండితే, లోపలి వరకు వేడెక్కి కరకరలాడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పుదీనాతో చేసిన గ్రీన్ చట్నీని వాడటం మర్చిపోకండి.. ఇది శాండ్‌ విచ్ రుచిని రెట్టింపు చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, March 28, 2026, 15:36 [IST]
Desktop Bottom Promotion