Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
కూరగాయలు లేనప్పుడు సింపుల్ గా మసాలా కర్రీ..రుచి అద్భుతం..రైస్, చపాతీలోకి కేక..ఎలా చేసుకోవాలంటే
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్ గా చేసుకునే టేస్టీ వంటకం మసాలా కర్రీ. రైస్, చపాతీలోకి ఇది అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంటికి సడెన్ గా చుట్టాలు వచ్చినప్పుడు టేస్టీగా చేసిపెట్టడానికి ఇది సూపర్ గా ఉంటుంది. కూరగాయలు అక్కర్లేని టేస్టీ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-యాలకలు
-జీలకర్ర
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయ
-కరివేపాకు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఆవాలు
-ఉప్పు
-పసుపు
-ధనియాల పొడి
-గరం మసాలా
-చింతపండు రసం

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో రెండున్నర టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి మీడియం మంట మీద బాగా ఫ్రై చేసుకున్నాక అందులోనే రెండున్నర టేబుల్ స్పూన్ల నువ్వులు, రెండున్నర టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి కొబ్బరి పొడి కలర్ మారేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
-చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు,2 యాలకలు వేసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇందులో పావు గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చి మిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వేపుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో అర టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి.
-ఇప్పుడు ఇందులో మిక్సీలో వేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ గరం మసాలా పొడి వేసి ఆయిల్ సైడ్స్ కి వచ్చేదాకా మీడియం మంట మీద కలుపుకోవాలి.
-తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, ముప్పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. గ్రేవీ పలుచగా కావాలనుకుంటే మరికొన్ని నీళ్లు పోసుకుండి. 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోండి. చివర్లో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications