Latest Updates
-
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా?
నో ఆయిల్, నో వాటర్..వెదురు బొంగులో ఘుమఘుమలాడే చికెన్..ఆ స్మోకీ ఫ్లేవరే వేరు!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలైన అరకు, లంబసింగి, మారేడుమిల్లి వెళ్ళినప్పుడు పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే వంటకం బ్యాంబూ చికెన్. దీనిని స్థానికంగా బొంగు చికెన్ అని కూడా పిలుస్తారు.
సాధారణంగా మనం చికెన్ వండాలంటే నూనె, నీరు వాడుతాము. కానీ ఈ పద్ధతిలో వెదురు బొంగులో ఉండే సహజమైన తేమ, చికెన్ లోని కొవ్వుతోనే మాంసం ఉడుకుతుంది. వెదురులో ఉండే ఔషధ గుణాలు, ఆవిరి చికెన్ కు పట్టి ఒక విలక్షణమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అందుకే ఇది అంత రుచిగా ఉంటుంది. గిరిజన సంప్రదాయ వంటకమైన దీనిని ఇంట్లో లేదా పిక్నిక్ స్పాట్స్ లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

కావలసిన పదార్థాలు
చికెన్: 1 కిలో స్కిన్ లెస్
వెదురు బొంగులు: 2- 3(ఒక వైపు మూసి ఉండాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 5-6
ఉల్లిపాయలు: 2
కారం: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
గరం మసాలా: 1 టేబుల్ స్పూన్
చికెన్ మసాలా: 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం: ఒక పెద్ద నిమ్మకాయ చెక్క
కొత్తిమీర: గుప్పెడు
ఆకులు: అరిటాకు లేదా సాల ఆకులు
తయారీ విధానం
-ముందుగా మీడియం సైజు చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు మొత్తం వదిలేలా చూడాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు వేయండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పొడవుగా చీరిన పచ్చిమిర్చి, కొత్తిమీర,నిమ్మరసం పిండాలి.
-మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలిపి, సుమారు 45 నిమిషాల నుండి 1 గంట పాటు పక్కన పెట్టాలి.
-ఇప్పుడు చేసిన చికెన్ మిశ్రమాన్ని వెదురు బొంగు లోపల నింపాలి. అయితే, బొంగు నిండుగా కాకుండా 80శాతం మాత్రమే నింపాలి. ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు ఆవిరి బయటకు రావడానికి కొంత ఖాళీ ఉండాలి.
-చికెన్ నింపిన తర్వాత, వెదురు బొంగు మౌత్ (ద్వారం)ను అరిటాకు లేదా సాల ఆకులతో గట్టిగా మూసివేయాలి. ఆవిరి బయటకు పోకుండా ఉండేలా దారం లేదా తీగతో ఆకును గట్టిగా కట్టాలి.
-ఇప్పుడు బొగ్గుల కుంపటి లేదా కట్టెల మంటపై ఈ వెదురు బొంగులను పెట్టాలి. మంట మరీ ఎక్కువగా ఉండకూడదు. సుమారు 30 నుండి 40 నిమిషాల పాటు బొంగును అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి.
-వెదురు బొంగు పచ్చని రంగు నుండి నల్లగా మారుతుంది. బొంగు నుండి సువాసన రావడం మొదలయ్యాక చికెన్ ఉడికినట్లే అని అర్థం చేసుకోవచ్చు.
-మంట మీద నుండి బొంగును దించి, కాస్త చల్లారాక మూతికి కట్టిన ఆకును తీసేయాలి. బొంగును బోర్లించి వెనక వైపు మెల్లగా కొడితే వేడి వేడి చికెన్ ప్లేట్ లోకి జారుతుంది. దీనిపై కాస్త నిమ్మరసం చల్లుకుని, ఉల్లిపాయలతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications