Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
క్రిస్మస్ స్పెషల్: ప్రాన్ అంబాట్ టిక్ రిసిపి
క్రిస్మస్ దగ్గరలో రాభోతోంది. క్రిస్మస్ అంటే ఒక మంచి రుచికరమైన ఆహారాలను రుచిచూడబోతున్నామన్నమాట. ఎందుకంటే, వివిధ రకాల ప్లేవర్స్ తో తయారుచేసే కేకులు, బిర్యానీ, నాన్ వెజ్ స్పెషల్స్ క్రిస్మస్ రోజున ప్రత్యేకంగా వండుతారు.
నాన్ వెజ్ వంటలో ప్రాన్స్ కూడా ఒక ఆహారపదార్థమే . ఈ సింపుల్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. కొంచెం కారంగా..కొంచెం పుల్లగా ఉండే ఈ వంటను మీ టేస్ట్ బడ్స్ కు రుచిచూపించాల్సిందే. మరి ఈ ప్రాన్స్ అంబాట్ టిక్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం...

ప్రాన్స్: 1kg (de-veined)
ఎండు మిర్చి : 6-7
పెప్పర్ కార్న్: 8-10
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
వెల్లుల్లి రెబ్బలు: 8
అల్లం: 1 మీడియం సైజ్ ముక్క
చింతపండు పేస్ట్: 2tbsp
ఉల్లిపాయలు: 2 (సన్నగా ముక్కలు)
ఆయిల్: 2tbsp
వెచ్చని నీళ్లు: 1 ½cups
తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్ ను నీటిలో వేసి శుభ్రంగా కడిగి తర్వాత పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ వేడి చేసి, అందులో జీలకర్ర, పెప్పర్ కార్న్ మరియు ఎండుమిర్చి వేయాలి.
3. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్ని 3,4నిముషాలు డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలి.
4. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 4,5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన తీసి చల్లారనివ్వాలి.
5. తర్వాత ముందుగా రోస్ట్ చేసిన పెట్టుకొన్న మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు అన్నింటిని మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, వేడయ్యాక అందులో పేస్ట్ చేసి పెట్టుకొన్ని మసాలా ముద్దను అందులో వేసి, మీడియం మంట మీద2,3నిముషాలు వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు మరియు నీళ్ళు పోసి, బాగా మిక్స్ చేసి తర్వాత ఉడికించుకోవాలి.
8. గ్రేవీ మొత్తం బాగా ఉడికిన తర్వాత అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న ప్రాన్స్ కూడా వేసి 10-15నిముషాలు ఉడికించుకోవాలి. అంతే డెలిషియస్ ప్రాన్ అంబాగ్ టిక్ రిసిపి. ఈ రుచికరమైన రిసిపిని అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











