Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
గార్లిక్ చికెన్ రైస్ రిసిపి: వీకెండ్ స్పెషల్
ఎప్పుడైనా స్పైసీగా మరియు టేస్టీగా ఏదైనా తినాలనుకొన్నప్పుడు మీరు ఈ టేస్టీ చికెన్ రిపిని ట్రై చేయవచ్చు. ఇది మరింత రుచికరంగా ఉంటుంది. గార్లిక్ చికెన్ ఒక డిఫరెంట టేస్ట్ నోరూరించే ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది. గార్లిక్-చికెన్ ఈ రెండింటి కాంబినేషన్ లో రైస్ ఫ్రై చేయడం వల్ల కొద్దిగా స్పైగా ఒక మంచి ట్రీట్ అందివ్వవచ్చు.
ఈ నాన్ వెజ్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. చాలా తక్కువ మసాలా దినుసులతో టేస్టీ గార్లిక్ చికెన్ ఫ్రైడ్ రైస్ రిసిపిని మంచి టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ తో నోరూరించేలా ఎలా తయారుచేయాలో చూద్దాం...

చికెన్: ½ kg (బోన్ లెస్ చికెన్)
బెల్ పెప్పర్: ½ (కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ: ½ (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి : 2 (పేస్ట్ చేసుకోవాలి)
లవంగాలు : 2
సోయా సాస్: 1tbsp
వెనిగర్: 1tbsp
బఠానీలు: 1cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులోబోన్ లెస్ చికెన్ వేయాలి.
2. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి, మూత పెట్టి 10నిముషాలు ఉడికించుకోంది.
3. చికెన్ ఉడికిన తర్వాత కుక్కర్ క్రిందికి దింపుకొని, ఆవిరి మొత్తం పూర్తిగా తగ్గే వరకూ ఉండి, తర్వాత చికెన్ ముక్కలను వేరుగా తీసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
5. ఇప్పుడు అదే పాన్ లో లవంగాలు, అల్లం, వెల్లుల్లి, బెల్ పెప్పర్, ఉప్పు, వెనిగర్ మరియు పచ్చిబఠానీ వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి.
6. ఈ మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలు వేసి, నిదానంగా వేయించుకోవాలి.
7. మొత్తం పోపు, చికెన్ ముక్కలు ఫ్రై అయ్యే వరకూ మరో 5నిముషాలు మీడియం మంట మీద వేయించుకోవాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా వండిపెట్టుకొన్న అన్నం వేసి ఫ్రై చేయాలి. అవసరం అయితే చికెన్ ఉడికించిన నీరు కూడా అందులోవేసి మిక్స్ చేసి మరో 5-10ఫ్రై చేసుకోవచ్చు.
9. వేయించేటప్పుడే, అందులో సోయాసాస్ కూడా వేసి వేయించుకోవాలి . అంతే స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా గార్లిక్ చికెన్ ను వడ్డించాలి.



Click it and Unblock the Notifications











