మలబార్ మీన్(చేపల) బిర్యానీ

Malabar Meen Biryani
బిరయానీ పేరు చెబితేనే అందరికీ నోరూరుతుంది. మనం ఎన్నోసార్లు బిరియానీ చేసుకుంటాం. ఎప్పుడూ ఒకేలా చేసుకుంటే ఏం బాగుంటుంది? అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేసుకుందాం..

కావలసిన పదార్థాలు:
రైస్ కోసం:
బియ్యం: 3cups
నీళ్లు: 6cups
నెయ్యి: 2tbsp
ఉల్లిపాయ: 1
పులావ్ ఆకులు: 2
యాలకుల పొడి: 1/2tsp
సోంపు: 1/2tsp
జాపత్రి: 2
లవంగాలు: 6
మిరియాల పొడి: 1tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
నిమ్మరసం: 1/2tsp
ఉప్పు రుచికి తగినంత
ఫిష్ మసాలా కోసం:
చేప ముక్కులు: 1/2cup
కొబ్బరిపాలు: 1/4cup
నెయ్యి: 2tsp
కారం: 1tsp
పసుపు: 1/2tsp
మిరియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
ఉల్లిపాయ: 1
టమోటోలు: 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
కొత్తిమీర పేస్ట్: 1tsp
గరం మసాలా: 1tsp
పెరుగు: 1tsp
నిమ్మరసం: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. ఐదు నిమిషాలు తర్వాత నీళ్లు ఒంపేసి, ఉప్పు వేసి హాఫ్ బాయిల్ చెయ్యాలి.
2. తర్వాత ఒక బౌల్ లో నెయ్యి వేడి చేసి అందులో పులావ్ ఆకులు, లవంగాలు, జాపత్రి, యాలకులు, సోంపు, దాల్చిన చెక్క, మిరియాల పొడి వేయాలి.
3. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించాలి. అర్వాత అన్నం నిమ్మరసం వేయాలి. ఐదు నిమిషాలయ్యాక నీళ్లు పోయాలి. బాగా ఉడికిన తర్వాత దించేసుకుని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు చేప ముక్కలను ముళ్లు తీసేసి, కారం, పసుపు, మిరియాల పొడి, ఉప్పు కలిపి అరగంట ఉంచాలి. తర్వాత వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవాలి.
5. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ, టమోటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తమీర పేస్ట్ వేయాలి. రంగు మారిన తర్వాత మంట తగ్గించి పెరుగు, కొబ్బరిపాలు, ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి.
6. ఇప్పుడు అందులో చేపముక్కలు వేసి సన్నని మంట మీద మిశ్రమం చిక్కబడే వరకూ ఉడికించాలి. లోతైన ఓ గిన్నెను తీసుకుని సగం అన్న వేయాలి. ఆపైన ఫిష్ మసాలాను వేయాలి. ఆపైన మళ్లీ అన్నం వేయాలి. పైన రెండు చెంచాల నెయ్యి వేసి మూత పెట్టాలి. ఆవిరి బయటకు రాకుండా మైదా పిండి ముద్దతో అంచులను మూసేయాలి. సన్నని మంటమీద పది నిమిషాలు మగ్గనిచ్చి దించేసుకోవాలి.

Story first published: Wednesday, June 13, 2012, 16:25 [IST]
Desktop Bottom Promotion