Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే..
సాయంత్రం వేళ పడే చల్లని వర్షం మనసుకు హాయినిచ్చినా.. అది తెచ్చే జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు మాత్రం ఇంట్లో వాళ్లందరినీ తీవ్రంగా బాధిస్తుంటాయి. ఇలాంటి వాతావరణంలో మీ చేతులు, కాళ్లలో విపరీతమైన నొప్పిగా అనిపిస్తోందా? మీ రోగనిరోధక శక్తి తగ్గిపోయినట్లు అనిపిస్తోందా? అయితే మీ వంటగదిలో ఉండే మునగాకు, ఉలవలతో ఘుమఘుమలాడే వేడి వేడి సూప్ తయారు చేసుకుని తాగండి.
ఈ సూప్ మీ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది. మునగాకు ఉలవల సూప్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మునగాకు ఉలవల సూప్ తయారీకి కావలసిన పదార్థాలు
ఉలవలు- ఒకటిన్నర టేబుల్ స్పూన్
నీళ్లు - ఒకటింబావు కప్పు
వెల్లుల్లి - 2 రెబ్బలు
అల్లం - అర అంగుళం ముక్క
సాంబార్ ఉల్లిపాయలు- 10
కొత్తిమీర - కొద్దిగా
మునగాకు - ఒక గుప్పెడు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
అదనపు నీరు - అర లీటరు
తాలింపు, అలంకరణ కోసం
కొబ్బరి నూనె - అర టీస్పూన్
లవంగాలు - 2
దాల్చిన చెక్క - చిన్న ముక్క
దంచిన చిన్న ఉల్లిపాయలు - 5
మునగాకు - 10 ఆకులు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - అర టీస్పూన్
నిమ్మకాయ - సగం
కొత్తిమీర - కొద్దిగా
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
మునగాకు ఉలవల సూప్ తయారీ విధానం
-ముందుగా కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి అందులో ఉలవలు వేసి మంచి సువాసన వస్తూ బంగారు రంగులోకి మారే వరకు దోరగా వేయించాలి. వాటిని పక్కకు తీసి ఒకసారి నీటితో శుభ్రంగా కడగాలి. తిరిగి ఆ ఉలవలను కుక్కర్ లో వేసి ఒకటింబావు కప్పుల నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
-కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి అందులో వెల్లుల్లి, అల్లం, చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, గుప్పెడు మునగాకు, జీలకర్ర, మిరియాల పొడి, పసుపు వేయాలి. దీనికి అర లీటరు నీళ్లు జతచేసి మళ్లీ మూతపెట్టి మరో 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
-ప్రెషర్ తగ్గాక, కుక్కర్ లోని మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వడకట్టాలి. వడకట్టగా మిగిలిన పదార్థాలను మిక్సీ జార్ లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమం నుంచి రసాన్ని (జ్యూస్) వడకట్టి, ముందుగా తీసిపెట్టుకున్న నీటిలో కలపాలి.
-తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేయండి. అందులో లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించండి. ఆ తర్వాత దంచి పెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాక ఒక 10 మునగాకులు వేసి కలపండి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న సూప్ నీటిని పాన్ లో పోయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి, మీడియం మంట మీద ఒక 5 నిమిషాల పాటు మరిగించి, సూప్ కాస్త చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి.
-చివరగా అర టీస్పూన్ మిరియాల పొడి, నిమ్మరసం,కొత్తిమీర చల్లుకుంటే.. వేడి వేడి, ఆరోగ్యకరమైన సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
