వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్‌ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!

ఆహారం పాడవకుండా, ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్‌లో పెట్టడమనేది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. అలా అని ప్రతి దానినీ ఫ్రిజ్‌లో పెడితే అది చివరికి క్యాన్సర్‌కి దారితీస్తుందని మీకు తెలుసా. చల్లటి వాతావరణంలో వాటిని స్టోర్‌ చేస్తే అది హెల్త్‌పై డెరెక్ట్‌గా అటాక్‌ చేసి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. మరి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచకూడదు. వాటిని ఎక్కడ స్టోర్‌ చేయాలి.. తెలుసుకుందాం..

Storing these food items in the fridge can lead to cancer

బంగాళాదుంపలు

బంగాళాదుంపల్లో ఎక్కువగా పిండి పదార్థం ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లో తక్కువ టెంపరేచర్‌లో పెట్టడం ద్వారా కార్బొహైడ్రేట్లు చక్కెరగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో వీటిని వండినప్పుడు అక్రిలమైడ్‌ అనే ప్రమాదకర రసాయనం ఉత్పత్తి అవుతుందని.. దీని ద్వారా క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ట్రైనర్‌ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!ట్రైనర్‌ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!

ఉల్లి- వెల్లుల్లి

ఉల్లి, వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచడం చాలా ప్రమాదకరం. లో టెంపరేచర్‌లో వీటిని ఉంచడం వల్ల నల్లటి బూజు వాటిపై ఏర్పడుతుంది. ఇందులో ఆస్పెర్‌గిల్లస్‌ అనే ఫంగస్‌ వ్యాపించి ఫుడ్‌ పాయిజనింగ్‌కి దారితీస్తుంది. దీంతో పొట్ట ఇన్‌ఫెక్షన్‌, వాంతులు, విరేచనాలు కలిగి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

పిండి పదార్థాలు

గోధుమ పిండి, మైదా పండి, శనగపిండిని సాధారణ ఉష్ణోగ్రతల్లో మాత్రమే స్టోర్‌ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టినట్లయితే తేమ కారణంగా పిండి ఉబ్బి అందులో పురుగులు, బూజు ఉత్పత్తికి దారితీస్తుంది. వీటిని వండుకుని తిన్నట్లయితే కడుపులో మైకోటాక్సిన్లు విడుదలై కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

Storing these food items in the fridge can lead to cancer

తేనె, నూనె

తేనె, నూనె పదార్థాల్లో సహజ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో చల్లటి ఉష్ణోగ్రతల్లో ఉంచినట్లయితే తేనె, నూనె స్ఫటికాలుగా మారి వాటిని నాశనం చేస్తాయి. ముఖ్యంగా ఆవ నూనె చిక్కబడి స్వచ్ఛత తగ్గిపోతుంది. దీనిని వంటలో ఉపయోగించి తిన్నప్పుడు జీర్ణశక్తిపై ప్రభావం చూపిస్తుంది.

సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్

టమాటాలు, అరటిపండ్లు

టమాటాలు, అరటిపండ్లలో గుండెకి మేలు చేసే లైకోపిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది. వీటిని ఫ్రిజ్‌లో పెడితే లైకోపిన్‌ విచ్ఛిన్నమవుతుంది. అరటిపండు తొక్క నల్లబడుతుంది. దీంతో పొటాషియం, విటమిన్‌ బి6 వేగంగా తగ్గిపోయి పోషకాలు తగ్గిపోయి భోజనంలో తీసుకున్నా ప్రయోజనం ఉండదు.

బ్రెడ్‌, బిస్కెట్లు

బ్రెడ్‌, బిస్కట్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లయితే త్వరగా ఆరిపోతుంది. దీంతో పిండిపదార్థాలు స్ఫటికాలుగా ఏర్పడి మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరానికి దారితీస్తాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలకి దారితీస్తుంది. పచ్చి, వండిన ఆహారాలను వేరుగా ఉంచడం కూడా ఆహారం ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, September 19, 2026, 10:53 [IST]
Desktop Bottom Promotion