Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.!
మరో 12 రోజుల్లో సెప్టెంబర్ నెల పూర్తి కానుంది. ఈ నెలలో ప్రధాన గ్రహాల సంచారం, గోచారం, యోగాలు చాలానే ఏర్పడ్డాయి. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి కలిసి రానుండగా, మరికొన్ని రాశుల వారికి కీర్తి, ప్రతిష్ఠ, సంపాదన తీసుకురానున్నాయి. ఫ్యామిలీ, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఎన్నో రకాలుగా కొన్ని రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశుల వారు ఈ మిగిలిన రోజులు తమ జీవితంలో ఊహించని మార్పులతో సంతోషంగా గడుపుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, వాటి స్థానాలు.. రాశి చక్రం ఆధారంగా పలు రకాలుగా ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాల సంచారంతో యోగాలు ఏర్పడ్డాయి.. ఏర్పడబోతున్నాయి. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుందని జ్యోతిష్యం చెబుతోంది. సూర్యుడు కన్యారాశిలో ఉండి బుధుడితో బుధాదిత్య యోగం ఏర్పరచడం, శుక్రుడు తులారాశివలో ఉండటం, కర్కాటకంలో కుజ- గురు సంచారం జరుగుతోంది. ఈ ప్రత్యేక గ్రహాల కలయిక, పరిణామాలతో ఈ రాశుల వారు ఈ నెలాఖరులోపు శుభ ఘడియలు పొందుతారు. మరి ఆ రాశులేంటో చూద్దాం..

కర్కాటక రాశి
సెప్టెంబర్ మిగిలిన రోజులు కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా ఉండనుంది. కుజు, గురు గ్రహాలు ఈ రాశిలోనే సంచరిస్తూ ఆశీర్వాదాలు అందిస్తున్నాయి. ఉద్యోగస్తులు తమ కష్టానికి గుర్తింపు పొంది శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారం చేయాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కూడా బాగుంటుంది. మీ నిస్వార్థమైన, ప్రధాన కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా ఉపశమనం పొందుతారు. కుటుంబీకులతో సంతోషంగా గడుపుతారు.

కన్యా రాశి
కన్యారాశిలో బుధాదిత్య యోగంతో వ్యాపారస్థులకు అదృష్టం పట్టబోతుంది. పెద్ద ఒప్పందాలు కుదరవచ్చు. ఎంతో కాలంగా ఆగిపోతూ ఉన్న పనులు పూర్తి అవుతాయి. దీంతో సమాజంలో గౌరవం, విజయం అందుకుంటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు అందుకోవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

తులా రాశి
శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం ఇంకా ఇదే రాశిలో సంచరిస్తుండటం వీరి కోరికలు నెరవేరే సమయాన్ని అందిస్తుంది. సెప్టెంబర్ మిగిలిన రోజులు వీరికి చాలా అనుకూలమైనవి. జీవితంలో ఆనందంగా ఉంటారు. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న మనస్పర్థలు, విభేదాలు తొలగిపోనున్నాయి. దీంతో కుటుంబీకుల మధ్య శాంతి, ప్రశాంతత ఉంటుంది. మీకు అవసరమైన వాహనం కొనాలనేందుకు కాలం కూడా కలిసివస్తుంది. మీ మనసులో ఎంతో కాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
