Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఉదయాన్నే కప్పు బార్లీ గంజి తాగితే..బుల్లెట్ వేగంతో బరువు తగ్గొచ్చు..ఎలా చేసుకోవాలంటే
బరువు తగ్గాలని ఉన్నా కూడా కఠినమైన ఆహార నియమాలు పాటించలేక ఇబ్బంది పడుతున్నారా? ఇకపై ఆ చింత అక్కర్లేదు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఒక అద్భుతమైన ఆహారం ఉంది. అదే బార్లీ గంజి. బరువు తగ్గించే మీ ప్రయాణంలో ఇది మీకు ఒక మంచి ఫ్రెండ్ లా సహాయపడుతుంది.
బార్లీ గంజిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, కొద్దిగా తిన్నా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ సేపటి వరకు ఆకలి వేయదు. అంతేకాకుండా బార్లీ శరీరంలో పేరుకుపోయిన అదనపు నీటిని బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని వాటర్ వెయిట్ అంటారు. చాలామందిలో బరువు పెరగడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

రోజూ ఉదయం పూట ఒక కప్పు బార్లీ గంజిని తీసుకుంటే ఈ వాటర్ వెయిట్ సమస్య తగ్గి, మీ శరీర బరువు ఊహించని వేగంతో తగ్గడం మీరే గమనిస్తారు. వెజిటబుల్ బార్లీ గంజిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బార్లీ - 100 గ్రాములు
నూనె - 1 టీస్పూన్
చిన్న ఉల్లిపాయ - 1
కరివేపాకు - ఒక రెమ్మ
చిన్న టమోటా - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
బీన్స్ - 5
క్యారెట్ - 1
పచ్చి బఠానీలు - గుప్పెడు
స్వీట్ కార్న్ - గుప్పెడు
పసుపు - పావు టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
గరం మసాలా -అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - అవసరమైనంత
కొత్తిమీర - గార్నిషింగ్ కోసం
తయారీ విధానం
-ముందుగా బార్లీని శుభ్రంగా కడిగి కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నానబెడితే ఇంకా మంచిది.
-ఉదయాన్నే నానబెట్టిన బార్లీలోని నీటిని వంపేసి మిక్సర్ గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ వేసి రెండు నిమిషాల పాటు బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలు బాగా పట్టేలా కలపాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బార్లీ మిశ్రమాన్ని వేసి గంజికి కావలసినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయండి.
-ప్రెషర్ పోయాక మూత తెరిచి చూడండి. గంజి మరీ చిక్కగా అనిపిస్తే, కొద్దిగా వేడినీళ్లు పోసి కలుపుకోవచ్చు. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించుకుంటే వేడివేడి, రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ గంజి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
