Latest Updates
-
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
ఈ గంజి ఒక్క కప్పు తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు,వెయ్యి ఏనుగుల బలం కూడా..ఎలా చేసుకోవాలంటే
చాలామంది బరువు తగ్గాలని రోజూ ఓకే రకమైన, రుచిపచి లేని ఫుడ్ తింటూ ఇబ్బంది పడుతుంటారు. అయితే మీ డైట్ లో రుచిని, ఆరోగ్యాన్ని జోడించే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే వేడివేడి, పోషకాలతో నిండిన గంజి. బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషించే ఉలవలు, బార్లీ వంటి ధాన్యాలతో చేసిన గంజి మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఉలవలు శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుండగా..బార్లీ జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది. ఈ రెండిటి కలయికతో తయారైన గంజి రోజు ఒక కప్పు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, మీ శరీరం బలంగా తయారవుతుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇది పిల్లలకు కూడా ఎంతో బలవర్థకమైన ఆహారం. బార్లీ ఉలవల గంజిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉలవలు- 1 కప్పు (250 గ్రా)
బార్లీ - 1 కప్పు
మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
గంజి చేయడానికి:
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - 6 రెబ్బలు
మిరియాలు - 10
జీలకర్ర - అర టీస్పూన్
బీన్స్ - 6
క్యారెట్ - 1
కొత్తిమీర - కొద్దిగా
గంజి పొడి - 4 టేబుల్ స్పూన్లు
నీరు - రెండున్నర కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ ను పెట్టి అందులో ఉలవలు వేసి మంచి సువాసన వచ్చేదాకా, కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కకు తీసి చల్లారనివ్వండి.
-తర్వాత అదే పాన్ లో బార్లీ వేసి 3-4 నిమిషాల పాటు దోరగా వేయించాలి. చివరగా మిరియాలు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించి, స్టవ్ ఆఫ్ చేయండి.
-వేయించినవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
-ఇప్పుడు ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల గంజి పొడిని తీసుకుని అందులో 1 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కరిగాక జీలకర్ర, మిరియాలు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి తరుగు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, బీన్స్ ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చల్లి, రెండు నిమిషాల పాటు బాగా వేపాక పాన్ లో 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి,కూరగాయలు మెత్తబడే వరకు సుమారు 5 నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి.
-కూరగాయలు ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గంజి మిశ్రమాన్ని అందులో పోసి, వెంటనే గరిటెతో బాగా కలపాలి. గంజి చిక్కబడే వరకు సుమారు 5-7 నిమిషాలు మీడియం మంటపై ఉడికించాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే వేడివేడిగా, రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉలవల గంజి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
