Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
పనీర్ భుర్జీ మేకరోని రెసిపీ
మేకరోని అనేది బహుముఖ పదార్ధం. మేకరోనితో ఒక కొత్త ఫ్యూజన్ రెసిపీని మాంసం,కూరగాయలు, పనీర్ లేదా ఏ ఇతర పదార్ధాలతో నైనా సృష్టించవచ్చు.
మేకరోని అనేది బహుముఖ పదార్ధం. మేకరోనితో ఒక కొత్త ఫ్యూజన్ రెసిపీని మాంసం,కూరగాయలు, పనీర్ లేదా ఏ ఇతర పదార్ధాలతో నైనా సృష్టించవచ్చు. అదే రుచితో ప్రయోగాలు చేసి రకరకాల రుచులను సృష్టించవచ్చు. ఈ రెసిపీ లో ఉపయోగించే పనీర్, మయోన్నైస్, మిరపకాయలు మొదలైనవి పూర్తిగా మేకరోని యొక్క భారతీయ రూపం. పనీర్ ని ఇష్టపడే స్నేహితులతో కలిసి తయారుచేసుకొని ఎంజాయ్ చేయండి.

Recipe By: చెఫ్ గౌరవ్ చదా
Recipe Type: స్నాక్స్
Serves: 3
-
నీరు - 1 లీటరు
ఉప్పు - రుచికి సరిపడా
మేకరోని - 2 కప్పులు
విజిటెబుల్ నూనె - 2 టేబుల్ స్పూన్లు
మీడియం సైజ్ ఉల్లిపాయ - 1 (తరిగినది)
పచ్చి మిరపకాయలు - 2-3 (తరిగినవి)
మీడియం ఆకుపచ్చ క్యాప్సికమ్ - ½ (తరిగినవి)
ఎర్ర కారం పొడి - 1 స్పూన్
పనీర్ (తురిమిన) - 1½ కప్పు
పాలు - 1½ కప్పు
తందూరి మయోన్నైస్ - 5 టేబుల్ స్పూన్లు
-
1. ఒక కుండ తీసుకోని దానిలో నీటిని నింపండి.
2. మీడియం మంట మీద నీటిని మరిగించాలి.
3. మరిగే నీటిలో 9 గ్రాముల ఉప్పు,మేకరోని వేయాలి.
4. ప్యాక్ మీద సూచనల ప్రకారం లేదా సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి.
5. మేకరోని అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలపాలి.
6. ఒక డ్రైనర్ సాయంతో ఉడికిన మేకరోనిలో ఉన్న నీటిని తొలగించాలి.
7. ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి.
8. వంట చేయటానికి నాన్ స్టిక్ స్ప్రే లేదా నూనెను ఉపయోగించవచ్చు.
9. పాన్ లో నూనె పోసి తక్కువ మంట మీద వేడి చేయాలి.
10. ఉల్లిపాయ, పచ్చి మిరప మరియు క్యాప్సికమ్ ముక్కలు కోసుకోవాలి.
11. పాన్ లో చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిరప మరియు క్యాప్సికమ్ లను వేయాలి.
12. ఒక నిమిషం వేగించాలి.
13. పనీర్ వేసి బాగా కలపాలి.
14. పాలు పోసి కూరగాయ ముక్కలు కలిసేలా కలపాలి.
15. పొయ్యి కట్టేసి మయోన్నైస్,చిటికెడు ఉప్పు వేసి కలపాలి.
16. మరల పొయ్యి వెలిగించి సాస్ 1-2 నిముషాలు లేదా చిక్కగా వచ్చేవరకు ఉడికించాలి.
17. సాస్ లో మేకరోని వేసి బాగా కలపాలి.
18. సర్వ్ చేయటానికి వేడి వేడి పనీర్ భుర్జీ మేకరోని రెసిపీ రెడీ.
- 1. మీకు నచ్చిన ఏ రకం పాస్తా అయినా ఉపయోగించవచ్చు.
- సర్వింగ్ సైజ్ - 1 కప్పు
- కేలరీలు - 400 కేలరీలు
- కొవ్వు - 32 గ్రాములు
- ప్రోటీన్ - 26 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు - 45 గ్రాములు
- పీచు - 3 గ్రాములు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications