Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
చికెన్ గ్రేవీ కాదు, మటన్ గ్రేవీ కాదు..కానీ రుచి మాత్రం అదే
మటన్, చికెన్ అంటే చాలామంది ఇష్టపడతారు. కొందరు అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు. అయితే ప్రతిరోజూ మటన్,చికెన్ చేసుకొని తినడం లేదా రెస్టారెంట్ కి వెళ్లి తినడం సాధ్యపడదు. అలాంటప్పుడు మటన్ చికెన్ లేకపోయినా కూడా అదే టేస్ట్ వచ్చే ఒక గ్రేవీ తయారుచేసుకుంటే? ఊహిస్తేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయ్ కదా. వంట పెద్దగా రానివాళ్లు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే వంటకం ఇది. చికెన్ మటన్ లేకుండా నాన్ వెజ్ రుచితో గ్రేవీ ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-లవంగాలు
-యాలకలు
-అల్లం
-వెల్లుల్లి
-జీలకర్ర
-ధనియాలు
-టమాటో
-కొత్తిమీర
-పుదీనా
-కారం
-పసుపు
-మిరియాలు
-నువ్వులు
-జాపత్రి
-దాల్చిన చెక్క
-పచ్చిమిరపకాయలు
-పెరుగు
-ఆయిల్
-ఉల్లిపాయ
-ధనియాల పొడి

తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో 3 పచ్చిమిరకాయల ముక్కలు, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 యాలక,కొద్దిగా జాపత్రి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టీస్పూన్ మిరియాలు, అర టీస్పూన్ జీలకర్ర, పొట్టు తీసిన 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 టీస్పూన్ కారం,10 పుదీనా ఆకులు,కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసి కొంచెం నీళ్లు పోసుకొని మొత్తాన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 2 టమాటోల పెద్ద ముక్కలు వేసి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. వెల్లుల్లి కలర్ వచ్చేదాకా వేయంచిన తర్వాత ఇందులోనే 1 టీస్పూన్ ధనియాల పొడి వేసి కలిపి 1 నిమిషం వేయించాక సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు అవి రంగుమారేదాకా వేయించుకోవాలి.
-తర్వాత గ్రైండ్ చేసుకునకన మసాలాల పేస్ట్ ను ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి.
-తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్, పావు టీస్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకొని మరో 3 నిమిషాలు వేయించుకోవాలి.
-ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకున్నాక అందులో 1 కప్పు బాగా చిలికిన పెరుగు,తగినంత ఉప్పు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మళ్లీ ఆయిల్ పైకి వచ్చేదాకా వేగించుకోవాలి.
-తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికిస్తే బాగా దగ్గరపడుతుంది. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ గ్రేవీ వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
