Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
టీ తాగుతూ,సినిమా చూస్తూ,కబుర్లు చెప్పుకుంటూ తినడానికి బెస్ట్ స్నాక్ ఇదే..క్రిస్పీగా ఎలా చేసుకోవాలంటే
మనదేశంలో సాంప్రదాయకమైన, క్రిస్పీ, రుచికరమైన స్నాక్ లిస్ట్ లో 'నిమ్కీ' టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఏ స్వీట్ షాపుకి లేదా స్నాక్స్ లభించే షాపుకి వెళ్లినా ముందువరుసలో ఇదే కనబడుతుంది. సినిమాలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో దీన్ని పక్కన పెట్టుకొని తింటుంటే ఎంత తింటామో లెక్క కూడా ఉండదు. అంత టేస్టీగా ఉంటాయి. దీనిని సాధారణంగా మైదా పిండితో తయారు చేస్తారు,వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగించి దీనికి ప్రత్యేకమైన రుచిని అందిస్తారు. నిమ్కీలను టీతో పాటు స్నాక్ గా లేదా పండుగల సమయంలో, అతిథులు వచ్చినప్పుడు అందిస్తారు. ఇది తయారు చేయడానికి చాలా సులభం, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉండే నిమ్కీలను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
నిమ్కీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మైదా పిండి
-బియ్యం పిండి
-డాల్డా
-వాము
-ఉప్పు
-నీరు: అవసరమైనంత (పిండి కలపడానికి)
-వేయించడానికి నూనె: సరిపడినంత
నిమ్కీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో పావు కేజీ మైదా పిండి,50 గ్రాముల బియ్యం పిండి,1 టీస్నూన్ నలిపిన వాము, 4 టేబుల్ స్పూన్ల కరిగించిన డాల్డా, రుచికి సరిపడా ఉప్పు వేసి బ్రెడ్ పొడిలా అయ్యేదాకా బాగా కలపండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని గట్టిగా కలుపుకోండి. పిండిని బాగా పిసికి బౌల్ మీద మూతపెట్టి అరగంట సేపు వదిలేయండి.
-తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ప్రతి ఉండను తీసుకుని, దానిని సన్నగా, చపాతీలా ఒత్తుకోండి. ఓ గుడ్డ మీద ఎక్కువగా పొడి పిండి చల్లుకొని దాని మీద కలిపిన పిండి ముద్ద పెట్టి పలచగా వత్తుకోవాలి.
-తర్వాత వత్తుకున్న దాన్ని డైమండ్ షేపులో చిన్న చిన్నవిగా చాకుతో కట్ చేసుకోండి. దానిమీద కొంచెం పొడి పిండి చల్లుకోండి.
-ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న నిమ్కీలను జాగ్రత్తగా నూనెలో వేయండి. ఒకేసారి ఎక్కువ నిమ్కీలను వేయకుండా, చిన్న బ్యాచ్ లుగా వేయండి.
-నిమ్కీలను బంగారు రంగు వచ్చేవరకు, అవి క్రిస్పీగా మారేవరకు వేయించండి. తక్కువ మంటపై వేయించడం వల్ల నిమ్కీలు లోపల వరకు బాగా ఉడికి, క్రిస్పీగా అవుతాయి.
-వేయించిన నిమ్కీలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోండి, తద్వారా అదనపు నూనె గ్రహించబడుతుంది.
-పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్కీలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. ఇవి సుమారు 2-3 వారాల వరకు తాజాగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





