Latest Updates
-
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు!
చికెన్ పకోడీని మరిపించే మిల్మేకర్ పకోడా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటారు
సాయంత్రం వేళ టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తుందా? లేదా ఇంటికి అనుకోకుండా అతిథులు వచ్చారా? ఇలాంటి సమయాల్లో తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోగలిగే అద్భుతమైన వంటకం మిల్మేకర్ పకోడా. దీనిని సోయా పకోడీ అని కూడా పిలుస్తారు.
శాకాహారులకు మాంసాహారంతో సమానమైన ప్రోటీన్ అందించే ఏకైక ఆహారం సోయా. దీంతో చేసే పకోడీ..రుచిలో చికెన్ పకోడీని తలపించేలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. టేస్టీ,క్రిస్పీ మిల్మేకర్ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిల్మేకర్
-ధనియాల పొడి
-జీరా పొడి
-ఎర్ర కారం
-ఉప్పు
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-మొక్కజొన్న పిండి
-శెనగపిండి
-ఆయిల్
-చికెన్ మసాలా
-అల్లంవెల్లుల్లి పేస్ట్
తయారీ విధానం
-ముందుగా 1 కప్పు మిల్మేకర్ ని వేడి నీళ్లలో వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత మిల్మేకర్ లోని నీటిని అంతా పిండేసి ఓ బౌల్ లోకి వాటిని తీసుకోండి.
-ఇప్పుడు మిల్మేకర్ లో అర స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ఎర్ర కారం, అర స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ మిల్మేకర్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులోనే 2 స్పూన్ల శెనగపిండి, 2 స్పూన్ల మొక్క జొన్న పిండి వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులో నీరు పోయాల్సిన అవసరం లేదు..ఎందుకంటే మిల్మేకర్ లో ఆల్రెడీ కొంచెం నీరు ఉంటుంది.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియంలో ఉంచి కలిపి ఉంచుకున్న మిల్మేకర్ ని ఒక్కొక్కటిగా నూనెలో వదలాలి.
-ఆయిల్ లో వేసిన వెంటనే వీటిని కదపకూడదు. 2 నిమిషాలు అలానే వదిలేసి తర్వాత కలుపుకోవాలి.
-2 నిమిషాల్లో పకోడీ రెడీ అవుతుంది అనుకున్నప్పుడు బాండీలో నిలువుగా చీరిన కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి.
-పచ్చిమిరపకాయలు కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత మొత్తాన్ని బాండీలో నుంచి తీసి ఓ టిష్యూ పేపర్ మీద ఉంచాలి. తద్వారా అదనపు నూనె పీల్చుకుంటుంది. అంతే క్రిస్పీ, టేస్టీ మిల్మేకర్ పకోడా రెడీ.
-మిల్మేకర్ పకోడా మీద నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయలతో కలిపి తింటుంటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications