Latest Updates
-
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం!
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే..
వేసవి కాలం వచ్చేసింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు చెరుగుతున్నాడు. బయట మండే ఎండలు, ఇంట్లో భరించలేని ఉక్కపోత.. ఇలాంటి వాతావరణంలో ఏది తినాలన్నా ఆసక్తి ఉండదు. ఎప్పుడూ కడుపుకు చల్లగా, మనసుకు హాయిగా, సేదతీర్చేలా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. రోజువారీ మధ్యాహ్న లేదా రాత్రి భోజనంలో కాస్త మార్పు కోరుకునే వారికి, ఈ ఎండల బారి నుండి ఉపశమనం పొందేందుకు పైనాపిల్ రైతా ఒక అద్భుతమైన ఆప్షన్.

పైనాపిల్ సహజంగానే మన శరీరాన్ని చల్లబరచడంలో ముందుంటుంది. పైగా వేసవిలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఇది చాలా మేలు చేస్తుంది. పైనాపిల్ లోని సహజమైన పుల్లదనం, తియ్యదనం, తాజా పెరుగులోని కమ్మదనంతో కలిసినప్పుడు పుట్టే రుచిని మాటల్లో వర్ణించలేం. ఈ చల్లని రైతాను పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే లొట్టలేసుకుని తింటారు.
పైనాపిల్ రైతా తయారీకి కావలసిన పదార్థాలు
తాజా పెరుగు - 2 కప్పులు
పైనాపిల్ ముక్కలు - 1 కప్పు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
బ్లాక్ సాల్ట్- పావు టీస్పూన్
ఎర్ర కారం పొడి - ఒక చిన్న చిటికెడు
కొత్తిమీర,పుదీనా - కొద్దిగా
దానిమ్మ గింజలు - కొద్దిగా

పైనాపిల్ రైతా తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, అందులో తాజా పెరుగు వేయండి. పెరుగులో ఎటువంటి ఉండలు లేకుండా, క్రీమ్ లాగా మృదువుగా మారేంత వరకు ఒక విస్కర్ లేదా చెంచాతో బాగా గిలకొట్టండి.
-ఇప్పుడు ఆ క్రీమీ పెరుగులో మీరు ముందుగా సిద్ధం చేసుకున్న చక్కెర, నల్ల ఉప్పు,వేయించిన జీలకర్ర పొడి వేయండి. ఈ పదార్థాలన్నీ పెరుగులో పూర్తిగా కరిగిపోయేలా బాగా కలపండి. వేయించిన జీలకర్ర పొడి రైతాకు ఒక అద్భుతమైన వాసనను ఇస్తుంది.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలను పెరుగు మిశ్రమంలో వేసి నెమ్మదిగా కలపండి. ఒకవేళ మీరు తీసుకున్న పైనాపిల్ కాస్త పుల్లగా అనిపిస్తే, ఆ ముక్కలను కొద్దిగా చక్కెర వేసి స్టవ్ మీద రెండు నిమిషాలు ఉడికించి, చల్లారాక పెరుగులో కలుపుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి మార్చుకోండి. దీనిపై చిటికెడు ఎర్ర కారం పొడిని అందంగా చల్లండి. పైనుండి కొత్తిమీర లేదా తాజా పుదీనా ఆకులు,ఎర్రటి దానిమ్మ గింజలతో అలంకరించండి. తయారుచేసిన ఈ రైతాను వెంటనే తినేయకుండా, ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచండి. బాగా చల్లారిన తర్వాత తీసి వడ్డించండి.
-బిర్యానీ, పులావ్ లాంటి మసాలా వంటకాలతో కానీ, లేదా సాధారణ అన్నంతో కానీ ఈ చల్లని పైనాపిల్ రైతాను తింటే, ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
