Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
రుచిలో రాజీ లేదు,ఆరోగ్యంలో సాటి లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ రవ్వ సజ్జ ఇడ్లీ..
సమయం లేకపోవడం వల్లనో లేదా రుచి కోసమో మనం తరచుగా నూనె, నెయ్యి ఎక్కువగా ఉండే పూరీ, పరాఠా లేదా బోండాల వంటి వాటిని బ్రేక్ ఫాస్ట్ లోకి చేసుకుని తింటుంటాం. ఇవి రుచిగా ఉన్నప్పటికీ, ఆరోగ్యం పరంగా అంత మంచివి కావు. కాబట్టి తేలికైన,పోషకాలతో నిండిన రవ్వ సజ్జ ఇడ్లీ ట్రై చేయండి.
ఇది కేవలం రుచికరమైనదే కాదు, షుగర్ పేషెంట్ల నుండి చిన్న పిల్లల వరకు అందరూ నిశ్చింతగా తినగలిగే సూపర్ ఫుడ్. సాధారణ ఇడ్లీల కంటే ఇవి ఎంతో భిన్నంగా ఉంటాయి. ఇందులో వాడే సజ్జ పిండి, రవ్వ కాంబినేషన్ వల్ల ఇడ్లీలు మృదువుగా రావడమే కాకుండా, శరీరానికి కావాల్సిన ఫైబర్, శక్తిని అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆప్షన్.
కావలసిన పదార్థాలు
బాంబే రవ్వ (సూజీ): 1 కప్పు
సజ్జ పిండి: అర కప్పు
పుల్లటి పెరుగు: 1 కప్పు
నీరు: పిండి కలపడానికి సరిపడినంత
వంట సోడా: అర టీస్పూన్
నూనె: 1 టేబుల్ స్పూన్
ఆవాలు: అర టీస్పూన్
కరివేపాకు: 6-8 ఆకులు
పచ్చిమిర్చి: 2
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించండి. ఈ తాలింపు ఇడ్లీకి మంచి సువాసనను ఇస్తుంది.
-తాలింపు వేగిన తర్వాత అందులోనే ఒక కప్పు రవ్వ, అర కప్పు సజ్జ పిండిని వేయండి. మంటను చిన్నదిగా పెట్టి పిండి నుండి కమ్మటి వాసన వచ్చే వరకు సుమారు 5 నుండి 6 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
-వేయించిన తర్వాత స్టవ్ ఆపి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
-వేయించి చల్లార్చిన రవ్వ సజ్జ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే దీనికి ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, అవసరమైనన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సాధారణ ఇడ్లీ పిండిలా మరీ జారుగా కాకుండా, కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి.
-ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి.
-పిండి బాగా నానిన తర్వాత ఇడ్లీలు వేసే ముందు మాత్రమే అందులో బేకింగ్ సోడా వేసి దానిపై కొంచెం నీళ్లు చల్లి పిండిలో కలిసేలా మెల్లగా కలపండి.
-ఇడ్లీ ప్లేట్లకు కొంచెం నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని అందులో వేయండి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి, ఈ ప్లేట్లను అందులో ఉంచి మూత పెట్టండి. మీడియం మంటపై 10 నిమిషాలు ఆవిరిపై ఉడికించండి.
-ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపి ఒక రెండు నిమిషాలు ఆగి ప్లేట్లను బయటకు తీయండి. వేడి వేడి రవ్వ సజ్జ ఇడ్లీలను కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా అల్లం పచ్చడితో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









