Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
రాగి పొంగలి వారానికి 2 సార్లు తింటే చాలు..కొండలను ఢీకొట్టే శక్తి..ఎలా చేసుకోవాలంటే..
పూర్వకాలం నుండి మన పెద్దలు రాగులను తమ రోజువారీ ఆహారంలో ముఖ్య భాగంగా తీసుకునేవారు. అందుకే వారు వృద్ధాప్యంలో కూడా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య ఆహారపు అలవాట్ల కారణంగా మధ్యలో మనం ఈ సంప్రదాయ ఆహారాలకు కాస్త దూరమైనప్పటికీ, నేటి కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా మళ్ళీ అందరూ చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే రాగులతో చేసే వంటకాల్లో రాగి సంగటి, రాగి జావ, రాగి రొట్టెలతో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన, రుచికరమైన వంటకం రాగి పొంగలి.

రాగి పొంగలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనంగా కూడా తీసుకోవచ్చు. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లైనా రాగి పొంగలిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం అలవాటు చేసుకుంటే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పనే ఉండదు.
రాగి పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగులు
-పెసరపప్పు
-నీళ్లు
-ఉప్పు
-నెయ్యి
-మిరియాలు
-జీలకర్ర
-అల్లం తరుగు
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-జీడిపప్పు
-ఇంగువ
రాగి పొంగలి తయారీ విధానం
-ముందుగా 1కప్పు రాగులను శుభ్రంగా కడిగి అందులో 4 కప్పుల నీళ్లు పోసి 6-7 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు పొట్టు లేసి పసుపు రంగు పెసరపప్పు వేసి దోరగా వేయించాక అందులో నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు 7 గంటల పాటు నానిన రాగుల్లో ఇంకో 4 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి.
-రాగులు బాగా ఉడికిన తర్వాత ఆఖరున అందులో నానిన పెసరపప్పు, ఉప్పు వేసి కలిపి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం కడాయి పెట్టి అందులో నెయ్యి లేదా పప్పుల నూనె వేసి అందులో అల్లం తరుగు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, జీడిపప్పు వేసి వేయించాలి.
-వేగిన తాలింపులో రెడీ చేసుకున్న రాగులు పెసరపప్పు మిశ్రమం వేసి కలుపుకోవాలి. అంతే రాగి పొంగలి రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా సాంబార్ తో కలిపి తింటే దాని రుచి అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
