Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నోరూరించే పల్లీ ఉండలు..ఏ స్వీట్ అయినా దీని ముందు జుజుబీ..ఎలా చేసుకోవాలంటే..
మనందరి ఇళ్లలో సాయంత్రం వేళల్లో పిల్లలు ఇష్టంగా తినేందుకు రకరకాల స్నాక్స్ తయారు చేస్తుంటారు. వాటిలో తీపి వంటకాలకు ఉండే స్థానం ప్రత్యేకం. అలాంటి కోవకే చెందింది ఈ వేరుశెనగ ఉండ. దీనిని పల్లీ ఉండ అని కూడా పిలుస్తారు. పల్లీ ఉండ పేరు వినగానే చాలు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ఈ రోజుకీ బేకరీలు, చిన్న చిన్న షాపులల్లో గాజు సీసాలలో భద్రంగా కనిపించే ఈ వేరుశెనగ, బెల్లం ఉండలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
వేరుశెనగలోని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి శక్తినివ్వగా.. బెల్లంలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇది పిల్లలకు ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక సంపూర్ణమైన, బలవర్థకమైన ఆహారం. పైగా దీనిని ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ అద్భుతమైన, కరకరలాడే పల్లీ ఉండలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పల్లీ ఉండలు తయారీకి కావాల్సిన పదార్థాలు
వేరుశెనగలు (పల్లీలు) - 2 కప్పులు
తురిమిన బెల్లం - 1 కప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
నీళ్లు - పావు కప్పు
పల్లీ ఉండలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి, తక్కువ మంట మీద వేరుశెనగలను దోరగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి, ప్రతీ గింజను రెండు బద్దలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు మరొక పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక దానిని వడకట్టి మళ్లీ అదే పాత్రలో పోసి పాకం పట్టాలి. ఇందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి.
-పాకం చిక్కబడుతున్నప్పుడు దానిని పరీక్షింఛాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఈ పాకం చుక్క వేస్తే అది కరిగిపోకుండా గట్టి ఉండలా మారాలి (దీనిని ఉండ పాకం అంటారు). అప్పుడే పాకం సరైన దశకు వచ్చినట్లు.
-పాకం సిద్ధమవ్వగానే వెంటనే స్టవ్ ఆపి అందులో వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. బెల్లం పాకం పల్లీలకు పూర్తిగా పట్టేలా కలపాలి.
-ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే, చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, కావలసిన పరిమాణంలో గట్టిగా నొక్కుతూ ఉండలుగా చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారితే ఉండలు చుట్టడం కష్టమవుతుంది.
-అంతే కరకరలాడే తియ్యటి వేరుశెనగ ఉండలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications