Latest Updates
-
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు?
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.!
శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలు ప్రత్యేక పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటం సర్వసాధారణం. ఉపవాసం సమయంలో ఇంట్లో పనులు చేయడం వల్ల నీరసించిపోకుండా పండ్లు, పాలు తీసుకుంటారు. ఫాస్టింగ్ విరమించాక నీరసం రాకుండా సాత్విక ఆహారం తీసుకుంటారు. ఈ క్రమంలో ఉపవాసం తర్వాత భారంగా అనిపించకుండా ఉండాలంటే ఫ్రూట్ టిక్కీలను ట్రై చేయండి.త్వరగా అరగడంతో పాటు నీరసం పోయి తక్షణ శక్తిని పొందుతారు. వీటి రుచికి ఫిదా అయిపోతారు.

ఫ్రూట్ టిక్కీలను ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి ఎక్కువ సమయం పట్టదు. ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఫ్రూట్ టిక్కీని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
ఫ్రూట్ టిక్కీ తయారీకి కావాల్సిన పదార్థాలు
ఉడికించిన బంగాళాదుంపలు – నాలుగు
సగ్గుబియ్యం – అర కప్పు
ఊదల పిండి- రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు – రెండు
కొత్తిమీర– గుప్పెడు
రాతి ఉప్పు- రుచికి సరిపడా
జీలకర్ర పొడి- అర టీస్పూన్
నిమ్మరసం – టీస్పూన్
నూనె లేదా నెయ్యి – వేయించడానికి సరిపడా
ఫ్రూట్ టిక్కీ తయారీ విధానం
ఫ్రూట్ టిక్కీ తయారీ కోసం ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి. సగ్గుబియ్యం మెత్తబడిన తర్వాత అందులోని నీటిని వడగట్టుకోవాలి. తర్వాత కాసేపు వాటిని అలాగే ఉంచుకోవాలి.
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో ఉడికించిన బంగాళదుంపలను పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం, ఊదల పిండి వేసి స్మూత్‌గా కలపాలి.
సన్నగా, గుండ్రంగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. చివరిగా నిమ్మరసం వేసి అన్నిటినీ బాగా కలిపి ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని టిక్కీల మాదిరిగా అరచేతితో తేలికగా ఒత్తుకోవాలి. పిండి మిశ్రమం మెత్తగా, జిగటగా లేకుండా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా ఊదల పిండిని కలపండి.
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
ఇప్పుడు స్టవ్‌పైన పెనం పెట్టుకుని వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి అప్లై చేయండి. నూనె వేడయ్యాక టిక్కీలను పెనంపైన వేసి రెండు వైపులా మీడియం మంటపైన కాల్చుకోవాలి. బంగారు రంగులోకి మారి కరకరలాడుతూ వచ్చేవరకు కాల్చాలి.
ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే.. పెరుగు, కొబ్బరి చట్నీ లేదా ఏదైనా సాస్‌తో తినవచ్చు. లేదంటే ఉపవాస నియమాలకు అనుగుణంగా వీటిని మామూలుగా అయినా ఆస్వాదించవచ్చు. బంగాళాదుంపల బదులు చిలకడదుంపలను సైతం టిక్కీల తయారీలో ఉపయోగించవచ్చు. ఇంకా బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌ను సైతం వేసుకోవచ్చు. వీటితో రుచి ఇంకా పెరుగుతుంది. శరీరానికి తగిన ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
