Latest Updates
-
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి! -
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి..చెత్తను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదో తెలుసా? -
వారం రోజుల పాటు రీల్స్, సినిమాలు చూడటం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.?
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.!
ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండుగే. ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒక ప్రత్యేక వంటకం ఉండాల్సిందే. మటన్, చేపలతో పోలిస్తే చికెన్ వండడం చాలా సులభం. అయితే కోడికూరలు చాలా వెరైటీలు ట్రై చేసి ఉంటారు. కానీ మిరియాలు, నిమ్మకాయతో ఎప్పుడూ ట్రై చేసి ఉండరు. ఈ సండే ఈ డిఫరెంట్ కాంబినేషన్‌తో ట్రై చేయండి.. ఇంటిల్లిపాదీ ఈ స్టార్టర్‌ను లొట్టలేసుకుంటూ తినాల్సిందే.

ప్రొటీన్లు పుష్కలంగా ఉండే చికెన్ అంటే ఇష్టపడని నాన్‌వెజ్ ప్రియులు ఉండరు. మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికీ చికెన్ దోహదపడుతుంది. అందుకే వారానికి ఒక్కసారైనా కోడికూర తినాలని వైద్యులు సైతం సూచిస్తారు. ఈ క్రమంలో ఈ ఆదివారం మీ ఇంటిల్లిపాదీ ఇష్టపడేలా ఇలా కొత్తగా లెమన్ పెప్పర్ చికెన్ స్టార్టర్ ట్రై చేయండి. చాలా తక్కువ నూనె ఉపయోగించి ఆరోగ్యకరంగా ఈ స్పెషల్ డిష్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చపాతీతో లేదా స్నాక్స్‌లా తినడానికి చాలా బాగుంటుంది. ఈ స్పెషల్ ద్వారా నిమ్మకాయలోని విటమిన్ సిని సైతం సులభంగా పొందుతారు.
పెప్పర్ లెమన్ చికెన్ స్టార్టర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్- అరకేజీ
పెరుగు- మూడోవంతు కప్పు
ఆయిల్- టేబుల్ స్పూన్
నల్ల మిరియాల పొడి- టేబుల్ స్పూన్
ఉప్పు- రుచికి తగినంత
పసుపు- పావు టీస్పూన్
నిమ్మ రసం- మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర- పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒకటిన్నర టేబుల్
స్పూన్
నిమ్మకాయ ముక్కలు- ఒకటి
ధనియాల పొడి- టేబుల్ స్పూన్
వేయించిన జీలకర్ర పొడి- టీస్పూన్
పెప్పర్ లెమన్ చికెన్ స్టార్టర్ తయారీ విధానం
ముందుగా బోన్‌లెస్ చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్, పసుపు, పెరుగు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక గంటపాటు మారినేట్ చేసుకోవాలి. దీని ద్వారా మసాలాలు చికెన్‌కు బాగా పడతాయి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక మారినేటెడ్ చికెన్ వేసుకోవాలి. చికెన్‌లో నీరు కారణంగా ఉడికేటప్పుడు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. నీళ్లు సగానికి వచ్చిన తర్వాత నిమ్మకాయ ముక్కలను వేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్, పెరుగులోని నీరు అంతా ఇంకిపోయేవరకు మీడియం మంటపైన ఉడికించుకోవాలి. ముక్కలన్నీ బాగా రోస్ట్ అయ్యి మంచి సువాసన వస్తుంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే పెప్పర్ లెమన్ చికెన్ స్టార్టర్ రెడీ..
ఈ పెప్పర్ లెమన్ చికెన్ స్టార్టర్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు. కారం లేకుండా హెల్తీగా మిరియాలు, నిమ్మకాయతో చేసిన ఈ స్టార్టర్ ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. సండే స్పెషల్‌లో చికెన్ పులుసుతో పాటు ఈ స్టార్టర్‌ను చేసుకున్నారంటే ఈవెనింగ్ స్నాక్స్‌గా లేదంటే చపాతీలోకి తినడానికి అద్భుతంగా ఉంటుంది. ఆయిల్ తక్కువగా వాడటం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications