Latest Updates
-
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.!
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.!
ఇడ్లీలలో ఆయిల్ తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా తమ డైట్లో చేర్చుకుంటారు. అయితే ఎప్పుడూ మినప్పప్పు, ఇడ్లీ రవ్వతో కాకుండా కొత్తగా పెసరపప్పు, ఉప్మా రవ్వతో ఇడ్లీలు ట్రై చేయండి. శరీరానికి కావాల్సినంత ప్రొటీన్‌తో పాటు కొత్త రుచిని ఆస్వాదించవచ్చు. తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండటంతో పాటు ఇడ్లీలు వద్దని మారాం చేసే పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు.

ప్రొటీన్ ఫుల్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
పెసర పప్పు- ఒక కప్పు(200 గ్రాములు)
పెరుగు- అర కప్పు
నూనె- రెండు టీస్పూన్లు
ఆవాలు- అర టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
ఇంగువ- కొద్దిగా
ఉప్మా రవ్వ- పావు కప్పు
పసుపు- పావు టీస్పూన్
క్యారెట్ తురుము- పావు కప్పు
కొత్తిమీర- కొద్దిగా
ఉప్పు- రుచికి సరిపడా
ప్రొటీన్ ఫుల్ ఇడ్లీ తయారీ విధానం
ముందుగా పెసరపప్పును రెండు మూడు సార్లు కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పెసరపప్పను మరోసారి కడగాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పెసరపప్పు, పెరుగును కలిపి మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా రుబ్బుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి వేగాక బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. చివరిగా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెసరపప్పు పిండిలో కలుపుకోవాలి. క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి మరోసారి కలిపి పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
ఈ లోపు ఇడ్లీలోకి చట్నీ తయారుచేసుకోవచ్చు. ప్రొటీన్ ఫుల్ ఇడ్లీలో చట్నీ తయారీ విధానం ఇలా..
స్టవ్ పైన పాన్ పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి వేడయ్యాక రెండు టీస్పూన్ల పల్లీలు, రెండు టీస్పూన్ల శనగపప్పు, మినప్పప్పు, చిన్న ముక్క అల్లం వేసి వేయించుకోవాలి. వేగాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో మూడు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా చేసి నూనెలో వేయించాలి. ఐదు వెల్లుల్లి రెబ్బలు, రెండు రెబ్బల చింతపండు, టీస్పూన్ కారం, రుచికి సరపడా ఉప్పు, కరివేపాకు వేసి కాస్త మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
చట్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకుని గ్లాసు నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి. పెసరపప్పు మిశ్రమంలో అవసరమైతే కాసిన్ని నీళ్లు కలుపుకోవచ్చు. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. మరోసారి కలపాలి.
ఇడ్లీ ప్లేట్లు తీసుకుని వాటిపైన కొద్దిగా నూనె అప్లై చేసి ఇడ్లీలు వేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఆవిరిపైన 10 నిమిషాల పాటు పెద్ద మంటపైన ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కాసేపటి తర్వాత మూత తీసి చూసినట్లయితే మెత్తని ప్రొటీన్ ఫుల్ ఇడ్లీలు రెడీ..
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
