Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కర్ణాటక స్పెషల్ పీనట్ రైస్..సింపుల్ రెసిపీ,సూపర్ టేస్ట్
ఉదయం లేవగానే చాలామంది తల్లుల్లు ఆలోచన టిఫిన్ ఏం చేయాలి? పిల్లల లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి? రోజువారీ ఇడ్లీ, దోశలు, ఉప్మాలు తిని పిల్లలే కాదు, పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతుంటారు.
ఉదయం హడావిడిలో త్వరగా అయిపోయే, అదే సమయంలో ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకం కోసం చూస్తున్నారా? అయితే కర్ణాటక స్టైల్ పీనట్ రైస్ ట్రై చేయాల్సిందే. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. వేరుశనగల్లో ఉండే ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడితే, నువ్వులు, కొబ్బరి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పీనట్ రైస్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వేరుశనగ గుళ్ళు (పల్లీలు) - 3 టేబుల్ స్పూన్లు
శనగ పప్పు - 2 టీస్పూన్లు
మినప పప్పు - 2 టీస్పూన్లు
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము లేదా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5 (కారానికి తగినట్లు)
జీలకర్ర -అర టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
వండిన అన్నం - 4 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగ గుళ్ళు - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
మినప పప్పు - 1 టీస్పూన్
శనగ పప్పు - ½ టీస్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - అర టీస్పూన్
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - సన్నగా తరిగినది
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను వేసి దోరగా, కరకరలాడే వరకు వేయించుకోవాలి.
-అవి వేగాక అందులోనే శనగ పప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. చివరగా ఎండు మిర్చి, కొబ్బరి వేసి కాసేపు వేయించి స్టవ్ ఆపేయండి.
-వేయించినవి చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె కాగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించండి. అవి కాస్త వేగాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, శనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేయండి. ఇప్పుడు జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. చివరగా పసుపు వేసి కలపండి.
-ఇప్పుడు తాలింపులో ముందుగా వండి పెట్టుకున్న అన్నం, మనం తయారు చేసుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. మంటను సిమ్ లో ఉంచి, అన్నం మెతుకులు విరిగిపోకుండా నెమ్మదిగా కలపండి.
-చివరగా స్టవ్ ఆపేసి, నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలపండి. అంతే పీనట్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications